ఏపీ ప్రభుత్వంపై మరోసారి మండిపడిన హైకోర్టు

ABN , First Publish Date - 2021-08-09T19:38:29+05:30 IST

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి మండిపడింది. కోర్టు ధిక్కారం కేసులో నలుగురు ఐఏఎస్‌లు

ఏపీ ప్రభుత్వంపై మరోసారి మండిపడిన హైకోర్టు

అమరావతి: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి మండిపడింది. కోర్టు ధిక్కారం కేసులో నలుగురు ఐఏఎస్‌లు, పంచాయితీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దివ్వేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌, పురపాలక శాఖ సెక్రటరీ శ్రీలక్ష్మీ, ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ హైకోర్టులో హాజరైనారు. పాఠశాలల భవనాల్లో రైతు భరోసా, పంచాయితీ భవనాలు, గ్రామ సచివాలయ నిర్మాణాలపై కోర్టు ధిక్కారణ కేసుపై న్యాయస్థానం విచారణ జరిపింది. స్కూల్‌ ఆవరణలో భవనాలు నిర్మించవద్దని...ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని కోర్టు వ్యాఖ్యానించింది. పేద పిల్లలు చదువుకునే స్కూల్స్‌లో వాతావరణ కలుషితం చేస్తున్నారని ధర్మాసనం మండిపడింది.


‘మీలో ఏవరైనా ఈ పాఠశాలల్లో చదువుకున్నారా’ అని  హైకోర్టు జడ్జి దేవానంద్‌ ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా నిర్మాణాలు ఎందుకు కొనసాగుతున్నాయని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలల ఆవరణలోకి రాజకీయాలను ఎలా తీసుకెళ్తారని కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ ఆగస్టు 31కి వాయిదా కోర్టు వాయిదా వేసింది. ఆగస్టు 31న కూడా అధికారులంతా హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. అన్ని విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నివేదిక ఇస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు.

Updated Date - 2021-08-09T19:38:29+05:30 IST