ఎవరిని ముద్దు పెట్టుకోని హీరోయిన్‌కే గతంలో ఎక్కువ అవకాశాలు వచ్చేవంటున్న నటి

పర్‌దేస్ చిత్రంలో షారూఖ్ సరసన నటించి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటి మహిమా చౌదరి. తప్పుని తప్పు అని  చెప్పడానికి ఆమె ఎప్పుడు కూడా సంకోచించదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అసమానతల గురించి గళమెత్తడానికి  వెనుకాడదు. ప్రస్తుతం హీరోయిన్‌లకు ఉన్నన్ని అవకాశాలు గతంలో లేవని ఆమె చెబుతోంది. 


ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘‘ గతంలో సినిమా ఇండస్ట్రీలో మహిళలకు అవకాశాలు తక్కువగా లభించేవి. ప్రస్తుతం వారికి మంచి పాత్రలు దక్కుతున్నాయి. యాడ్‌లల్లో నటించడం ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నారు.  ప్రస్తుత హీరోయిన్‌లు నటించే కాలం గతంలో కంటే కూడా పెరిగింది ’’ అని చెప్పింది.


ఎవరితో అయినా సరే మీరు డేటింగ్ చేయడం మొదలుపెట్టారంటే మీ కెరీర్ ముగిసినట్లేనని ఆమె వివరించింది. ఎవరిని కూడా ముద్దు పెట్టుకోని హీరోయిన్‌నే సినిమాలోకి తీసుకోవడానికి నిర్మాతలు ఆసక్తి చూపేవారని స్పష్టం చేసింది. ఒక వేళ ఎవరైనా డేటింగ్ మొదలుపెడితే.. ‘‘ఆమె డేటింగ్ చేస్తుంది’’ అని కోడై కూసేవారని పేర్కొంది. ఒక వేళ మీకు పెళ్లి అయితే మీ కెరీర్ ముగిసినట్లేనని వివరించింది. పెళ్లి అనంతరం పిల్లలు పుట్టరా మీ కెరీర్ పూర్తిగా మరచిపోవాల్సిందేనని తెలిపింది.


ఖయమత్ సే ఖయమత్ తక్ సినిమాలో ఆమిర్ ఖాన్, గోవిందాలతో పాటు మహిమా కూడా నటించింది. ఆ సినిమా సంగతులను వివరిస్తూ..‘‘ ఆ సినిమా షూటింగ్ సమయంలో  ఆమిర్ ఖాన్, గోవిందాలకు పెళ్లి అయినట్టు నాకు తెలియదు. బాలీవుడ్‌కి చెందినవారు తమ పిల్లల ఫొటోలను చూపించడం, వారిని బయటి ప్రపంచానికి పరిచయం చేయడం వంటివి చేయరు. ఎందుకంటే వారి వయసు బయటపడుతుందని వారి అనుమానం. అటువంటి ఆలోచనలు అన్ని ఇప్పుడు మారాయి ’’ అని చెప్పింది. ప్రస్తుతం ప్రేక్షకులు మహిళలను వివిధ పాత్రల్లో చూడటానికి ఇష్టపడుతున్నారని వివరించింది.

Advertisement

Bollywoodమరిన్ని...