‘ఆరోగ్య’ కేటాయింపులు పెంచాలి

ABN , First Publish Date - 2021-01-25T07:58:14+05:30 IST

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై హెల్త్‌కేర్‌ పరిశ్రమ భారీగా ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా ఆరోగ్య రక్షణకు అవసరమైన మౌలిక వ సతుల కల్పనకు ఈ బడ్జెట్‌లోనైనా త

‘ఆరోగ్య’ కేటాయింపులు పెంచాలి

బడ్జెట్‌పై హెల్త్‌కేర్‌ పరిశ్రమ ఆశలు


న్యూఢిల్లీ: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై హెల్త్‌కేర్‌ పరిశ్రమ భారీగా ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా ఆరోగ్య రక్షణకు అవసరమైన మౌలిక వ సతుల కల్పనకు ఈ బడ్జెట్‌లోనైనా తగినన్ని నిధులు సమకూర్చాలని కోరుతోంది. కొత్త ఔషధాల అభివృద్ధి కోసం గతంలో ఫార్మా కంపెనీలు చేసే పరిశోధన, అభివృద్ధి ఖర్చులకు ఆదాయ పన్ను (ఐటీ) చట్టం కింద 200 శాతం మినహాయింపు ఉండేది. ఖర్చుల హేతుబద్దీకరణ పేరుతో ఈ మినహాయింపుకు ప్రభు త్వం మంగళం పాడింది. కనీసం వచ్చే బడ్జెట్‌లోనైనా  ఆర్థిక మంత్రి మళ్లీ ఈ పన్ను ప్రోత్సాహకాన్ని పునరుద్ధరించాని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. 


తాయిలాలు తప్పదు:కొవిడ్‌ దెబ్బతో దేశ వ్యాప్తం గా పలు ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ మూతపడ్డాయి. ఉన్న హాస్పిటల్స్‌ వ్యాపారం పడిపోయింది. ఇక చిన్న చిన్న పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ గురించైతే చెప్పాల్సిన పని లేదు. ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వం హాస్పిటల్‌ రంగానికి వచ్చే కేంద్ర బడ్జెట్‌లో మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని అపోలో హాస్పిటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రీతా రెడ్డి కోరారు. ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆస్పత్రులు ఏర్పాటు చేసేందుకు రాయితీ ధరలతో స్థలాలు కేటాయించాలని కోరారు. జీఎ్‌సటీ నిబంధనలు సరళీకృతం చేయాలన్నారు. 


ఆరోగ్య రక్షణ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెంచాల్సిన అవసరాన్ని కొవిడ్‌ మళ్లీ గుర్తు చేస్తోంది. సిబ్బంది శిక్షణ, నైపుణ్యాల పెంపుతో పాటు దేశంలో మరిన్ని వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలి. స్థానిక తయారీకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సమర్ధవంతమైన ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) నమూనాలు రూపొందించాలి.

ప్రీతా రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్‌పర్సన్‌, అపోలో హాస్పిటల్స్‌ 


బడ్జెట్‌లో వైద్య రంగానికి కేటాయింపులు పెంచాలి. ప్రభుత్వం ఇతోధికంగా సాయమందిస్తేనే ఈ రంగం  గాడిన పడుతుంది. 

అశుతోష్‌ రఘువంశీ, ఎండీ, సీఈఓ, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌

Updated Date - 2021-01-25T07:58:14+05:30 IST