కోన కణ్వాశ్రమ అధిపతి స్వామి విష్ణుదాసు శివైౖక్యం

ABN , First Publish Date - 2021-05-14T06:25:48+05:30 IST

ప్రముఖ ఆధ్మాత్మిక తృష్ణ కోన కణ్వాశ్రమ అధిపతి స్వామివిష్ణుదా సు(70) కోనలో గురువారం శివై ౖక్యంచెందారు.

కోన కణ్వాశ్రమ అధిపతి స్వామి విష్ణుదాసు శివైౖక్యం
శివైక్యం చెందిన స్వామివిష్ణుదాసు పార్థివదేహం

చెన్నేకొత్తపల్లి, మే 13: ప్రముఖ ఆధ్మాత్మిక తృష్ణ కోన కణ్వాశ్రమ అధిపతి స్వామివిష్ణుదా సు(70) కోనలో గురువారం శివై ౖక్యంచెందారు. కొంతకాలంగా అనా రోగ్యంతో బాధపడుతూ చివరికి ఆరోగ్యం విషమించి గురువారం తె ల్లవారు జామున 5.30గంటలకు భౌతికదేహాన్ని వదిలినట్లు ఆశ్రమభ క్తుడు పోతన్న తెలిపారు.  మధ్యా హ్నం 3గంటలకు కోనలో ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ధ్యాన మందిరంలో సద్గురువులను సమాధిచేయు సంప్రదాయం ప్రకారం సమాధి చేశారు. కోన కణ్వాశ్రమ అభివృద్ధికి స్వామివిష్ణుదాసు ఎంతో కృషిచేశారని మాజీ మంత్రి పరిటాలసునీత పేర్కొన్నారు. ఆయన శివైక్యంచెందా డన్న విషయం తెలుసుకుని తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తంచేశారు.   ఇప్పటి ఉత్తరాంచల్‌ రాష్ట్రం అల్మోడజిల్లా సామాగ్రామానికి చెందిన స్వామి విష్ణుదాసు 1975 నవంబరులో పుట్టపర్తికి వచ్చారు. కోన ఆశ్రమం గొప్పతనాన్ని తెలుసుకుని, అప్పట్లో దివ్యమాత మాతృశ్రీ అంజనాదేవి ఆశీస్సులతో అక్కడే ఉండిపో యాడు. అయితే 1977లో మాతృశ్రీ అంజనాదేవి శివైౖక్యం చెందడంతో  స్వామివిష్ణుదాసు ఆశ్రమ బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి 45 ఏళ్ల తన సుదీర్ఘ ఆశ్రమాధిపతి ప్రస్తానంలో కోనక్షేత్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశారు. 


Updated Date - 2021-05-14T06:25:48+05:30 IST