హెడ్‌ కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-06-28T06:22:22+05:30 IST

టీడీపీ నాయకుడిని చితకబాదిన హెడ్‌ కానిస్టేబుల్‌ రఘునాథరెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.

హెడ్‌ కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలి

మాజీ మంత్రి కాలవ డిమాండ్‌

  కణేకల్లు, జూన్‌ 27: టీడీపీ నాయకుడిని చితకబాదిన హెడ్‌ కానిస్టేబుల్‌ రఘునాథరెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. మండలంలోని జక్కలవడికి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఎర్రిస్వామి రెడ్డిపై వైసీపీ నాయకులు చేసిన దాడిని తెలుసుకున్న ఆయన వెంటనే కణేకల్లు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ మార్గమధ్యలో కణేకల్లు క్రాసింగ్‌ వద్ద సీఐ యుగంధర్‌ కాలవ శ్రీని వాసులును అడ్డుకుని తాను బాధితునికి న్యాయం చేస్తానని, మీరు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లవద్దంటూ సముదాయిం చారు. అక్కడే బాధితున్ని కలసి మాజీ మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రఘునాథరెడ్డి స్వామిభక్తి పరాకాష్టకు చేరిందని టీడీపీ వారంటేనే స్టేషన్‌లోనే దాడులు చేసే సంఘ టనలు కోకొల్లలు వున్నాయని ఆయన మండిపడ్డారు. రఘునాథరెడ్డి అడుగులకు మడుగులు ఒత్తుతూ ఎస్‌ఐ నిస్సహాయస్థితిలో వున్నాడని కాలవ ఆరోపించారు. పోలీసు వ్యవస్థ అంటే ప్రజల్లో ఎంతో గౌరవం నమ్మకం వున్నాయని, కానీ హెడ్‌ కానిస్టేబుల్‌ రఘునాథరెడ్డి తీరు వల్ల పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని ఆయన మండిపడ్డారు. చట్టప్రకారం బాధితులకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే దాడులు చేస్తుండటంతో ఇంక తమ బాధను ఎవరికి చెప్పుకో వాలో తెలియక ప్రజలు అల్లాడే పరిస్థితి కణేక ల్లులో నెలకొందన్నారు. వెంటనే హెడ్‌ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు ఎస్‌ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-06-28T06:22:22+05:30 IST