పండుగకు ప్రయాణికుల కష్టాలు

ABN , First Publish Date - 2020-10-25T10:59:28+05:30 IST

పండుగకు సొంత ఊరు వెళ్దామనుకుంటే అంతరాష్ట్ర బస్సులు లేక ఏపీ వాసులకు ప్రయాణ ఇక్కట్లు ఎదుర్కొంటున్నా రు.

పండుగకు ప్రయాణికుల కష్టాలు

తెలంగాణ-ఆంధ్ర మధ్య నడవని బస్సులు ఆటోలే దిక్కు... రెట్టింపు చార్జీలు


కోదాడ, అక్టోబరు 24: పండుగకు సొంత ఊరు వెళ్దామనుకుంటే అంతరాష్ట్ర బస్సులు లేక  ఏపీ వాసులకు ప్రయాణ ఇక్కట్లు ఎదుర్కొంటున్నా రు. ఉపాధి, ఉద్యోగరీత్యా హైదరాబా ద్‌లో నివాసం ఉంటున్నవారు దసరా సందర్భంగా సొంతూళ్లకు పయణమ య్యారు. అయితే కరోనా నేపథ్యలో అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నిలిచా యి. వాటిని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పునరుద్ధరించకపోవడంతో ప్రయాణి కులు నానా ఇబ్బందులు పడుతున్నా రు.ఏపీ వాసులు హైదరాబాద్‌ నుం చి కోదాడ వరకు బస్సులో చేరుకొని ఇక్కడి నుంచి ఆటోల్లో వెళ్లాల్సి వస్తోంది. స్థోమత ఉన్నవారు రూ.350కి ప్రత్యేకంగా ఆటో మాట్లాడుకొని జగ్గయ్యపేట వరకు వెళ్లి, అక్కడి నుంచి బస్సులో సొంత గ్రామాలకు వెళ్తున్నారు. స్థోమత లేనివారు మాత్రం రూ.40 చెల్లించి షేరింగ్‌ ఆటోల్లో వెళ్తున్నారు. కోదాడ, జగ్గయ్యపేటల మధ్య దూరం 25కి.మీ. ఈ రెండు పట్టణాల మధ్య బస్సు సర్వీసులు నడిపితే ఇబ్బందు లు ఉండవని ప్రయాణికులు చెబుతున్నారు.


కరోనాకు ముందు ఏపీ నుంచి హైదరాబాద్‌కు వందలాది బస్సు సర్వీసులు నడిచేవి. కొవిడ్‌ కారణంగా అంతరాష్ట్ర ప్రయాణాలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడం తో ఈ బస్సు సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం దశలారీగా ఆంక్షలు ఎత్తివేసినా ఇరు రాష్ట్రాల మధ్య బస్సుల కొనసాగింపుపై స్పష్టత రాలేదు. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. అయితే పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏపీ సరిహద్దు గరికపాడు వరకు 50 బస్సు సర్వీలు నడుపుతున్నట్లు కోదాడ డిపో అధికారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి కోదాడకు రూ.250 చార్జీ ఉండేది. ప్రత్యేక బస్సు సర్వీసు పేరుతో రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారు. అయితే ఇవి సకాలంలో లేకపోవడంతో ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇప్పటికైనా జగ్గయ్యపేట-కోదాడ మధ్య బస్సులు నడపాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. 


బస్సులు లేక ఇబ్బంది పడుతున్నాం

పండుగకు ఇంటికి వెళ్దామనుకుంటే ఏపీకి బస్సులు లేవు. దీంతో కోదాడలో బస్సు దిగి విజయవాడ వెళ్లేందుకు ఆటోను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకోకపోవడమే దీనికి కారణం. తమిళనాడు, కర్ణాటకాలో ఉండే ఏపీవాసులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇళ్లకు చేరుతున్నారు. మేము మాత్రం హైదరాబాద్‌ నుంచి వచ్చేందుకు అష్టకష్టాలుపడుతున్నాం. ఆటోలో వెళ్తూ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యతవహిస్తారు.

- వాసుబోయిన శ్రీనివాసరావు, పడమటిలంక, విజయవాడ 

Updated Date - 2020-10-25T10:59:28+05:30 IST