చేనేత ఇక్కత వసా్త్రలు అత్యద్భుతం

ABN , First Publish Date - 2022-06-29T06:31:42+05:30 IST

ఖండాంతరఖ్యాతి గాంచిన భూదానపోచంపల్లిలోని చేనేత ఇక్కత వసా్త్రలు అత్యద్భుతం అని హ్యాంస్టెక్‌ ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌లోని ఫ్యాషన టెక్నాలజీ విద్యార్థులు కొనియాడారు.

చేనేత ఇక్కత వసా్త్రలు అత్యద్భుతం
చేనేత మగ్గాన్ని పరిశీలిస్తున్న ఫ్యాషన టెక్నాలజీ విద్యార్థులు


 భూదానపోచంపల్లి సందర్శించిన హ్యాంస్టెక్‌ ఫ్యాషన టెక్నాలజీ విద్యార్థుల బృందం

భూదానపోచంపల్లి, జూన 28: ఖండాంతరఖ్యాతి గాంచిన భూదానపోచంపల్లిలోని చేనేత ఇక్కత వసా్త్రలు అత్యద్భుతం అని హ్యాంస్టెక్‌ ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌లోని ఫ్యాషన టెక్నాలజీ విద్యార్థులు కొనియాడారు.  పట్టణంలోని రూరల్‌ టూరిజం సెంటర్‌ను  మంగళవారం సందర్శించి మ్యూజియంలోని లీవ్‌ టు క్లాత ప్రాసెసింగ్‌ యూనిట్‌ సందర్శించిన హైదరాబాద్‌ పంజాగుట్టకు చెందిన హ్యాంస్టెక్‌ ఫ్యాషన టెక్నీలజీ విద్యార్థులు చేనేత వస్త్ర తయారీ ప్రక్రియలను పరిశీలించారు. తమ కోర్సులో టెక్స్‌టైల్‌ అంశంపై క్షేత్ర పర్యటనలో భాగంగా ఇక్కడికి సందర్శించామని, కార్మికుల కళాత్మక నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా చూసి చేనేత కళాత్మకరంగాన్ని వీక్షించామని తెలిపారు. ఫ్యాషన టెక్నాలజీ విభాగానికి చెందిన 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి హ్యాంస్టెక్‌ కాలేజీ హెచవోడీ అజిత యోగేష్‌, ఫ్యాకల్టీలు అమృత, మేఘన మార్గదర్శనం చేశారు. 


Updated Date - 2022-06-29T06:31:42+05:30 IST