చేతికొచ్చిన పంట నోటికందకపోయె

ABN , First Publish Date - 2021-01-11T04:42:30+05:30 IST

సకాలంలో వర్షాలు కురవ డంతో వరి సాగు చేసి కాసింత ఆదాయం పొంది, ఏడాది పొడవునా తిండిగింజలకు కొదవలేదని పించుకుందామనుకున్న రైతన్న ఆశ అడియాశలైంది.

చేతికొచ్చిన పంట నోటికందకపోయె
పోరుమామిళ్లలోని మల్లకతువ వద్ద దెబ్బతిన్న వరి పైరు

పోరుమామిళ్ల, కలసపాడు మండలాల్లో

సుమారు వెయ్యి ఎకరాల్లో దెబ్బతిన్న వరి

ఆందోళనలో రైతన్నలు

 సకాలంలో వర్షాలు కురవ డంతో వరి సాగు చేసి కాసింత ఆదాయం పొంది, ఏడాది పొడవునా తిండిగింజలకు కొదవలేదని పించుకుందామనుకున్న రైతన్న ఆశ అడియాశలైంది. చేతికొచ్చిన పైరును తెగుళ్లు ఆశించడంతో నోటికాడిదాకా వచ్చిన తిండి నోట్లోకెళ్లలేక పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోరుమామిళ్ల మండలంలో దాదాపు 250 ఎకరాల్లో వరి సాగుచేస్తే తెగుళ్లు సోకి ధాన్యం దిగుబడి తగ్గింది. కలస పాడు మండలంలో సుమారు 800 ఎకరాల్లో వరి సాగు చేస్తే మెడవిరుపు, ఉల్లికోడు, అగ్గితెగుళ్లు ఆశించడంతో దిగుబడి రాక అప్పులపాలయ్యారు. ప్రభుత్వం ఆదుకోవా లని రైతులు వేడుకుంటున్నారు. వివరాల్లోకెళితే...

పోరుమామిళ్ల, జనవరి 10:  పోరుమామిళ్లలో మల్లకత్తువ, చెరువుకట్ట, రామాయపల్లె సమీపంలో మునుపెన్నడూ లేని విధంగా నీరుండడంతో ఆ చుట్టుపక్కల రైతులందరూ వరి సాగు చేశారు. కింది భాగంలో దాదాపు 250 ఎకరాలు సాగు చేశారు. తెగుళ్లు సోకడంతో గింజలు దిగుబడి రాక సాళ్లు ఏర్పడి పైరంతా ఎర్రగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాక మల్లకతువ పై భాగాన సుంకేసులపల్లె, బలిజకోట ప్రాంతాల రైతుల వరి దెబ్బతినడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎకరాకు 40 బస్తాల ధాన్యం వస్తుందనుకుంటే కనీసం ఐదు బస్తాలు కూడా దిగుబడి వచ్చే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు దాదాపు 30వేలకు పైగా ఖర్చు పెడితే పెట్టుబడి అయినా వచ్చే పరిస్థితులు లేవని రైతన్నలు వాపోతున్నారు.

రామాయపల్లె పరిసర ప్రాంతంలో 50 మంది వరి సాగు చేస్తే అకాలవర్షంతో పంట దెబ్బతిని గింజలు లేక సాలు గింజలే ఎక్కువగా ఉండడంతో దిగుబడి తగ్గింది. పిడుగుమస్తాన 70 సెంట్లలో వరి సాగు చేస్తే 25బస్తాలు దిగుబడి  రావాల్సి ఉండగా కేవలం ఐదు బస్తాలే వచ్చాయి. ఇందులో కోత మిషనుకే దాదా పు రూ.3500 చెల్లించాల్సి వచ్చిందని, ఇక పెట్టుబడులు, దిగుబడులు రాక నష్టం వాటిల్లిందని వాపోతున్నాడు. బలిజకోట వీధికి చెందిన పల్లెంశెట్టి పెద్దయ్యకు సంబంధించి ఐదెకరాలు వరి దెబ్బతింది.

చాలా మంది రైతులు కౌలుకు తీసుకుని  తీసుకుని సాగు చేసినా దిగుబడి రాక అప్పులపాలైనట్లు వాపోయారు. కొద్దిరోజుల్లో పంట చేతికొస్తుందని ఆశించి తీరా పొలం వద్దకు వెళ్లి చూస్తే ఎర్ర గా మారి సాగు గింజలు ఉండడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

కలసపాడులో....

కలసపాడు, జనవరి 10: వరికి తెగులు సోకడంతో రైతు కు దిగులు పట్టుకుంది. మండల వ్యాప్తంగా గత ఖరీఫ్‌ సీజనలో అకాల వర్షాలతో వరిపంట దిగు బడి తగ్గి ఎకరాకు పది మూటలు కూడా రాలేదు. వర్షాల్లో రైతులు మళ్లీ నాట్లు వేసి నా సరైన దిగుబడి రాలేదు. ఇందుకు ప్రధా న కారణంగా మెడవిరుపు, ఉల్లికోడు, అగ్గితెగులని చెబుతున్నారు.

మండలంలో దా దాపు 800 ఎకరాల్లో ఎనడీఎల్‌ఆర్‌, జిలకర రకాలను సాగు చేశారు. జిలకర రకం ఎకరాకు పది బస్తాలు కూడా రాని పరిస్థితి. వ్యవసాయాధికారులు పంట కోత ప్రయో గం నిర్వహించి పంట నష్టంపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపాలని రైతులు కోరుతున్నారు.

ఈ విషయమై వ్యవసాయాధికారి కృష్ణమూర్తిని వివరణ కోరగా వరుస వర్షాలతో వాతావరణం మార్పులతో పంటలకు తెగుళ్లు సోకుతున్నాయని రైతన్నలు సమగ్ర సస్యరక్షణలు సకాలంలో పాటిస్తే దిగుబడులు పెరుగుతాయన్నారు. ప్రస్తు తం అధికారులకు నివేదికలు పంపుతామని తెలిపారు. 


పెట్టుబడి రాదాయె...

 పొలం లేకపోవడంతో ఐదెకరాలు కౌలుకు తీసుకుని లక్షా 50వేలు పెట్టుబడి వరి సాగు చేస్తే పూర్తిగా దెబ్బతినింది. దాదాపు 200 బ స్తాలు దిగుబడి వస్తుందని ఆశిస్తే కనీసం 40 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి కనబడడంలేదు. 

వెంకటసుబ్బయ్య, కౌలు రైతు, బలిజకోట

ఆరెకరాలు దెబ్బతినింది  

 వరి పండించుకోవచ్చని ఆశించి వరి సాగు చేస్తే చేతికొచ్చే దశలో చేజారిపోయే పరిస్థితి దాపురించింది. దాదాపు లక్షా 30వేలు పెట్టుబ డి పెడితే పెట్టుబడి వచ్చే పరిస్థితీ కనబడడంలేదు. కష్టాలు కన్నీళ్లు తప్పడంలేదు.

హసనవలి, రైతు, బలిజకోట

నత్రజని వాడకం తగ్గించాలి   

రైతులు నత్రజని వాడకం తగ్గించాలి. ఎర్రగా ఉన్న పైర్లలో ఎకరాకు 30కిలోలు పొటాషి యం చల్లాలి. మబ్బులు వచ్చే కాలం కావడం, కల్లాల్లో నీరు ఎక్కువగా ఉండి తేమ ఉంటే ఇలాంటి పరిస్థితి వస్తుం ది. రైతులు పంట చేతికొచ్చే దశలో పొలాల్లో నీరు లేకుండా చూడా లి. ఏవైనా సలహాలకు వ్యవసాయాధికారులను సంప్రదించాలి.

వర హరికుమార్‌, వ్యవసాయాధికారి







Updated Date - 2021-01-11T04:42:30+05:30 IST