Abn logo
May 10 2021 @ 23:35PM

ఈదురుగాలుల బీభత్సం!

జీడి, మామిడికి అపార నష్టం 

ఆందోళనలో రైతులు

సోంపేట రూరల్‌/కంచిలి/ హరిపురం, మే 10: సోంపేట, కంచిలి, మందస మండలాల్లో సోవామరం ఈదురుగాలలు బీభత్సం సృష్టించాయి. మధ్యాహ్నం 3 గంటల వరకూ భానుడు ప్రతాపం చూపాడు. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. సాయంత్రం 4 గంటల తరువాత ఉరుములు, ఈదురుగాలలుతో కూడిన వర్షం ప్రారంభమైంది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. ఈదురుగాలలుకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. వివిధ గ్రామాల్లో ఇళ్ల రేకులు సైతం ఎగిరిపోయాయి. జీడి, మామిడి పంటకు అపార నష్టం కలిగింది. జీడి పచ్చిపిక్కలు నేలకొరిగాయి. మునగ చెట్లు నేలవాలాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. స్తంభాలు నేలకొరగడంతో అర్ధరాత్రి వరకూ పునరుద్ధరించలేకపోయారు. ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. 


పిడుగుపాటుకు యువకుడి మృతి

కంచిలి, మే 10 : మేత కోసం పశువులను పొలాల్లోకి తీసుకెళ్లిన యువకుడిపై పిడుగుపడడంతో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద ఘటన జలంత్రకోట పంచాయతీ మధు పురంలో సోమవారం సాయంత్రం జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన డి గ్రీ చదువుతున్న యువకుడు డొక్కరి మేఘనాథం (20) గేదెలను మేపేందుకు నారాయణపురం పొలాలకు తీసుకెళ్లాడు. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం ప్రారంభ మైంది. దీంతో గేదెలను తోలుకొని ఇంటికి బయలుదేరిన మేఘ నాథంపై పిడుగుపడింది. పొలాల్లోనే కుప్పకూలిపోయాడు. అక్కడున్న వారు గుర్తించేసరికి మృతిచెందాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్థులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Advertisement