రక్షక్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-10-20T05:21:11+05:30 IST

మొబైల్‌ వాహనాల్లో తిరుగుతున్న రక్షక్‌ సిబ్బంది నిరం త రం అప్రమత్తంగా ఉండాలని కడప డీఎస్పీ బి.వెంకటశివారెడ్డి తెలిపారు. నగ రం లోని మొబైల్‌, బ్లూకోల్ట్స్‌, రక్షక్‌ వాహనాల పోలీసు సిబ్బందికి కడప డీఎస్పీ వెంక టశివారెడ్డి పలు సూచనలు చేశారు.

రక్షక్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
సిబ్బందితో మాట్లాడుతున్న డీఎస్పీ వెంకటశివారెడ్డి

కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి దిశానిర్దేశం

కడప(క్రైం), అక్టోబరు 19: మొబైల్‌ వాహనాల్లో తిరుగుతున్న రక్షక్‌ సిబ్బంది నిరం త రం అప్రమత్తంగా ఉండాలని కడప డీఎస్పీ బి.వెంకటశివారెడ్డి తెలిపారు. నగ రం లోని మొబైల్‌, బ్లూకోల్ట్స్‌, రక్షక్‌ వాహనాల పోలీసు సిబ్బందికి కడప డీఎస్పీ వెంక టశివారెడ్డి పలు సూచనలు చేశారు. మహిళలు, కళాశాల విద్యార్థినులను వెంటబడి వేధించే ఆకతాయిల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో దొంగతనాలు దోపిడీలు జరగకుండా గస్తీ ముమ్మరం చేయాలన్నారు. ఆదే విధంగా కమాండ్‌ కంట్రోల్‌లో విధులు నిర్వర్తించే సిబ్బంది నగరంలోని సీసీ కెమెరాలను ఎల్లవేళలా గమనిస్తూ ఎక్క డైనా ట్రాఫిక్‌ జామ్‌ అయినా, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. 

Updated Date - 2021-10-20T05:21:11+05:30 IST