పేదలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

ABN , First Publish Date - 2022-06-30T06:33:09+05:30 IST

ఎన్నికలకు ముందు, తర్వాత పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ డిమాండ్‌ చేశారు.

పేదలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ధర్నాలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌

  సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌

మోత్కూరు, జూన 29: ఎన్నికలకు ముందు, తర్వాత పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం మోత్కూరు మండల, పట్టణ పేద ప్రజలు వినతి పత్రాలు చేతబట్టుకుని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 57 ఏళ్లకు ఆసరా పింఛన, స్వంత స్థలాలు ఉన్నవారు ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.3లక్షల ఆర్థికసాయం, నూతన రేషన కార్డులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. పీఎం ఆవాజ్‌ యోజన పథకం కింద ప్రధాని మోదీ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ప్రకటించారని, ఇక్కడ ఒక్కరికి కూడా అందలేదన్నారు.   ప్రభుత్వం వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తహసీల్దార్‌ షేక్‌ అహమ్మద్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రజలు ఇళ్లు, పింఛన్లకు సంబంధించిన వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి, నాయకులు గుండు వెంకటనర్సు, కూరపాటి రాములు, రాచకొండ రాములమ్మ, కూరెళ్ల రాములు, కుందుకూరి నర్సింహ, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T06:33:09+05:30 IST