‘పట్టు’ తప్పుతోంది

ABN , First Publish Date - 2022-07-03T04:48:47+05:30 IST

మల్బరీ సాగులో మొదటి స్థానంలో ఉన్న రాయచోటిలో నియోజకవర్గంలో పట్టు పరిశ్రమ ఆదరణకు నోచుకోవడంలేదు.

‘పట్టు’  తప్పుతోంది
సాగులో ఉన్న మల్బరీ పంట

తగ్గుతున్న సాగు విస్తీర్ణం 

ఏటా రూ.10 లక్షలు ఆర్జించండి 

అవగాహన పెంచుతున్న అధికారులు

లక్కిరెడ్డిపల్లె, జూలై 2: మల్బరీ సాగులో మొదటి స్థానంలో ఉన్న రాయచోటిలో నియోజకవర్గంలో పట్టు పరిశ్రమ ఆదరణకు నోచుకోవడంలేదు. గతం లో రాయచోటి, లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గాల్లో 20 వేల హెక్టార్లలో మల్బరీ సాగులో ఉండడం, ప్రత్యే కించి కార్యాలయాలు, సిబ్బందిని ఏర్పాటు చేసి పంటను వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. మల్బరీపై మక్కువ పెరగడంతో ప్రతి రైతు బావు లు, చెరువుల కింద సాగు చేసేవారు. తక్కువ పెట్టుబడులతో ఎక్కువ సంపాదిస్తూ రైతులు లాభాలు ఆర్జించారు. ప్రస్తుతం రైతులు పట్టు పరి శ్రమపై మొగ్గు చూపడం లేదు. ఇందుకు కారణా లు పెద్దగా చెప్పలేకున్నా అధికారులు మాత్రం సెరికల్చర్‌పై రైతులకు సూచనలు, సలహాలు ఇస్తూ రైతులకు పట్టపరిశ్రమపై పట్టు సాధించేలా చేయా లని యత్నిస్తున్నా వారు పట్టుకోల్పోతున్నారనే చెప్పవచ్చు. వివరాల్లోకెళితే.....

 సుమారు 30 ఏళ్ల కిందట లక్కిరెడ్డిపల్లె, రాయచోటి ప్రాంతాల్లో మల్బ రీ సాగు మొదటి స్థానంలో ఉండేది. 1980 నుంచి 90 లోపు రాయచోటి, లక్కిరెడ్డి పల్లె నియోజకవర్గాల్లో 20 వేల హెక్టార్లలో మల్బరీ పంట సాగు చేసేవారు. అప్పట్లో ధర తక్కువైనా పట్టువదలని విక్రమార్కుల్లా రైతులు మల్బరీ సా గుపై మక్కువ చూపేవారు. 1990 నుంచి 2000 వరకు మల్బరీ సాగు పూర్తి స్థాయిలో తగ్గి  10 వే ల హెక్టార్లకు చేరుకుంది. ప్రస్తుతం వందల ఎకరాల్లోకి చేరుకుందని చెప్పవచ్చు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లెల్లో ప్రత్యేకించి కార్యాలయాలు ఏర్పా టు చేసి ఒక్కో కార్యాలయంలో 30 మంది ఉద్యో గులు పనిచేసేవారు.

ప్రస్తుతం సాగు తగ్గిపోవడం తో వీరిని ఇతర శాఖలకు బదిలీ చేశారు. అధికా రులు మాత్రం మల్బరీ సాగు బలోపేతానికి రైతులకు సలహాలు, సూచనలు ఇస్తూనే ఉన్నారు. ప్రస్తుతం రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో 15 మండలాల్లో మాత్రమే మల్బరీ సాగులో ఉంది. మొక్కలు నాటేందుకు, ఆకు పెరుగుదలకు, పురు గులకు రైతులకు యూనిట్‌కు రూ. 50 వేలు అందిస్తోంది. పదేళ్లగా ప్రభుత్వం చేయూతనిస్తు న్నా రైతులు ముందుకు రాకున్నారు. పెద్ద షెడ్డుకు రూ. 3 లక్షలు, చిన్న షెడ్డుకు లక్షన్నర, పురుగులు మేపుకొనేందుకు, సబ్సిడీపై బుట్టలు ప్రభుత్వం అందజేస్తున్నా మల్బరీ సాగుపై మక్కువ చూడం లేదు. మల్బరీ సాగులో ఉన్న ఆదాయం మరి ఏ పంటలో రాదని, ఒక కాపులో ఎకరాకు ఐదు నుంచి 7 లక్షలు ఆదాయం వస్తుందని సిరికల్చర్‌ అధికారు లు చెబుతున్నారు. రాయచోటి నియోజకవర్గంలో సుండుపల్లె, కంచి పాటివాండ్లపల్లె, పందిళ్లపల్లె, జీ. రాచపల్లె, రాచపల్లె, తదితర గ్రామాల్లో సాగు చేస్తున్నారు.

కరోనా మహమ్మారితో పూర్తిగా సాగు నిలబడి పోయింది.  పట్టు గూళ్లు తెల్లవి సుమారు రూ. 700, పచ్చవి రూ. 500లకు పైగా ధర పలుకు తోంది. ఏది ఏమైనా రైతును అన్ని విధాలా ఆదుకు నే పంట మల్బరీ సాగని అధికారులు వివరిస్తున్నా రు. ప్రతి రైతు ఎకరా సాగు చేసుకుంటే ఏటా రూ. 10 లక్షలు ఆర్జించవచ్చని అధికారులు చెబుతున్నా రు. ఏది ఏమైనా మల్బరీ సాగును మరింత పెం చేందుకు రైతులు ముందుకు రావాలని సిరికల్చర్‌ అధికారులు సూచిస్తున్నారు. 


30 ఏళ్లగా సాగు చేస్తున్నాం

30 ఏళ్లగా ఆరెకరాల్లో అన్నదమ్ములం సాగు చేస్తున్నాం. లక్షల రూపాయలు దిగుబడులు సాధించాం. కరోనా వల్ల రెండేళ్లగా పంట సా గు చేయకుండా వదిలేశాం. మల్బరీ సాగు త ప్ప ఏ పంట సాగు చేయలేదు. మళ్లీ మల్బరీ సాగు మొదలుపెడతాం. 

వెంకట్రమణ, బూడిదగుంటపల్లె, లక్కిరెడ్డిపల్లె మండలం


మంచి దిగుబడులు సాధిస్తున్నాం

 మల్బరీసాగులో మంచి దిగుబడులు సాధి స్తున్నాం. పంట 8కి 8 విస్తారంగా సాగు చే శాం. మల్బరీ సాగులో కొత్త పద్దతులు పాటి స్తున్నాం. ఎకరాకు రూ.6 లక్షలు లాభాలు సాధిస్తున్నాం. సాగులో అధికారుల ప్రోత్సాహం చాలా బాగా ఉంది. 

కృష్ణయ్య, కంచిపాటివాండ్లపల్లె, సుండుపల్లె మండలం


ప్రభుత్వం సబ్సిడీ బాగా ఇస్తోంది

ప్రభుత్వం మల్బరీ పంట సాగు కోసం మొ క్క నుంచి షెడ్డు వరకు చంద్రికలు, బుట్టలు సబ్సిడీతో ప్రభుత్వం అందిస్తోంది. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. మల్బరీ సాగులో మంచి లాభాలు సాధించవచ్చు. ప్రతి రైతూ ముందుకు రావాలి.

మోహన్‌బాబు, సిరికల్చర్‌ అధికారి  





Updated Date - 2022-07-03T04:48:47+05:30 IST