హరితహారం పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-06-20T06:36:02+05:30 IST

పట్టణ ప్రాంతంలో హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పురపాలక కమిషనర్‌ సత్యనారాయణ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్‌ సమావేశ మందిరంలో ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పురపాలిక అధికారులతో తెలంగాణకు హారితహా

హరితహారం పకడ్బందీగా నిర్వహించాలి
మాట్లాడుతున్న రాష్ట్ర పురపాలక కమిషనర్‌ సత్యనారాయణ

ఆదిలాబాద్‌, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాంతంలో హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పురపాలక కమిషనర్‌ సత్యనారాయణ  అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్‌ సమావేశ మందిరంలో ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పురపాలిక అధికారులతో తెలంగాణకు హారితహారం కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భం గా సీడీఎంఏ మాట్లాడుతూ నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటి సంరక్షించాలని, 85శాతం మొక్కలను సంరక్షించని పక్షంలో చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మున్సిపల్‌ బడ్జెట్‌లో 10శాతం హారితహారానికి నిధులు కేటాయించాలని ఆ నిధులతో పట్టణంలో పచ్చదనం సంతరించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కలెక్టరు సిక్తాపట్నాయక్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల అదనపు కలెక్టర్‌లు ఎం.డేవిడ్‌, రాజేశం, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, కమిషనర్‌ శైలజ, శ్రీనివాస్‌, నరేందర్‌, మున్సిపల్‌ ఇంజనీర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T06:36:02+05:30 IST