సింహం అత్యాశ!

ABN , First Publish Date - 2020-12-02T05:30:00+05:30 IST

ఒకానొక అడవిలో ఒక సింహం ఉండేది. దానికి ఒకరోజు మధ్యాహ్నం అయ్యేసరికి బాగా ఆకలి వేసింది. వెంటనే వేటకు బయలుదేరింది. దారిలో ఆ సింహానికి కుందేలు కనిపించింది. కానీ ‘ఈ చిన్న కుందేలును తింటే నా ఆకలి తీరదు’ అని సింహం ముందుకు వెళ్లింది...

సింహం అత్యాశ!

ఒకానొక అడవిలో ఒక సింహం ఉండేది. దానికి ఒకరోజు మధ్యాహ్నం అయ్యేసరికి బాగా ఆకలి వేసింది. వెంటనే వేటకు బయలుదేరింది. దారిలో ఆ సింహానికి కుందేలు కనిపించింది. కానీ ‘ఈ చిన్న కుందేలును తింటే నా ఆకలి తీరదు’ అని సింహం ముందుకు వెళ్లింది. కొంతదూరం వెళ్లాక దానికి పొదల్లో మేస్తున్న జింక కంటపడింది.. ఆ జింకను చంపి తింటే తన ఆకలి తీరుతుందనుకుని పరుగుతీసింది.


సింహాన్ని చూసిన జింక ప్రాణభయంతో వేగంగా పరుగెత్తడం మొదలెట్టింది. కానీ ఆకలితో ఉన్న సింహం జింక అంత వేగంగా పరుగెత్తలేక అలసిపోయింది. చేసేదేమిలేక తిరిగి వచ్చిన దారి పట్టింది. ‘చిన్న జంతువైన కుందేలును చంపి ఆకలి తీర్చుకుని ఉంటే బాగుండు. అనవసరంగా అత్యాశకు పోయాను’ అనుకుని నిరాశగా వెనుదిరిగింది.

Updated Date - 2020-12-02T05:30:00+05:30 IST