రాజధాని కోసం మహిళల మహా పాదయాత్ర

ABN , First Publish Date - 2020-02-20T07:47:47+05:30 IST

‘అమరావతి కోసం పోరాడుతాం.. అమరావతిని కదిలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని కదలనివ్వం..’ అని అమరావతి పరిరక్షణ సమితి

రాజధాని కోసం మహిళల మహా పాదయాత్ర

గుంటూరు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ‘అమరావతి కోసం పోరాడుతాం.. అమరావతిని కదిలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని కదలనివ్వం..’ అని అమరావతి పరిరక్షణ సమితి, మహిళా జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులో బుధవారం మహిళలు మహా పాదయాత్ర నిర్వహిం చారు. రాజధాని తరలింపు రాష్ట్ర ప్రజ లందరి సమస్య అంటూ జాతీయ జెండా రంగుల వస్త్రధారణ చేసిన మహి ళలు బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి వెంకటేశ్వరా విజ్ఞాన మందిరం వరకు ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండా లు, పచ్చ జెండాలు చేతబూని మహి ళలు పాదయాత్రకు కదిలి వచ్చారు. రాజధాని మార్పు నిర్ణయంతో ఆందోళన తో మృతి చెందిన వారికి తొలుత నివా ళులర్పించారు. అనంతరం బీఆర్‌ స్టేడి యం నుంచి పాతబస్టాండ్‌,  జిన్నాట వర్‌ సెంటర్‌, కురగాయాల మార్కెట్‌, మహిళా కళాశాల, నాజ్‌ సెంటర్‌ మీద గా వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏపీ మ్యాపును తలపించేలా మానవహారం గా ఏర్పడి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. 


రాజధాని గ్రామాల నుంచి రాక

జేఏసీ పిలుపు మేరకు రాజధాని గ్రామాలైన తుళ్లూరు, రాయపూడి, తాడి కొండ, పెదపరిమి, పొన్నెకల్లు, నిడము క్కల తదితర ప్రాంతాల నుంచి మహిళ లు, రైతులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనకు తరలివచ్చారు. వీరి కి జీఏసీ నేతలతో పా ్డటు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు మద్దతు తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు.  


64 రోజూ కొనసాగిన ఆందోళనలు

రాజధాని అమరావతి దీక్షలు బుధవా రం మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగగా, వెలగపూడి, రాయపూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెంలో 64వ రోజు రిలే దీక్షలు కొనసాగించారు. తాడి కొండ అడ్డరోడ్డు, గుంటూరు కలెక్టరేటు ఎదుట, పెదపరిమి, 14మైలు తదితర ప్రాంతాలల్లో ఆందోళనలు కొనసాగాయి. తుళ్లూరు, మందడం, వెలగూడిలో 24 గంటల దీక్షను రైతులు, రైతు కూలీలు, మహిళలు చేపట్టారు. ఎమ్మెల్యే శ్రీదేవికి మేకప్‌లపై ఉన్న శ్రద్ధ రాజధాని రైతులు సమస్యలపై లేదంటూ మందడంలో మహిళలు, రైతులు వినూత్నంగా నిరస న తెలిపారు. మహిళలు ముఖాలకు పెయింట్‌ పూసుకొని నిరసన తెలిపారు.


సీఎం మనసు మారాలంటూ నేలపాడులో యాగాలు

సీఎం జగన్‌ మనసు మారాలని, అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగేలా చూడాలంటూ బుధవారం నేలపాడు రైతులు, మహిళలు, కూలీ లు హోమాలు నిర్వ హించారు. తమ గ్రామ పరిధిలో నిర్మించిన హైకో ర్టు, అఽధికారుల నివాస గృహాల సముదాయాలను చూస్తే సీఎం, మంత్రుల మనస్సు మారతాయని  మహిళలు కనీటి పర్యతం అయ్యా రు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రైతులు, కూలీలు ఐక్యంగా పోరాడి అమరావతిని సాధించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. రాజధాని 29 గ్రామాల్లో దళిత డప్పు కళాకారులతో గురువారం ఉదయం 5 గంటలకు ప్రభాత భేరి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జేఏసీ నేత కే శ్రీనివాస్‌ తెలిపారు. అమరా వతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కొనసాగించాలే చూడాలంటూ వంద మంది ముస్లింలు అమరావతి నుంచి కడప దర్గాకు పాదయాత్ర చేయను న్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. 

Updated Date - 2020-02-20T07:47:47+05:30 IST