గొప్ప రాజనీతిజ్ఞుడు కొణిజేటి రోశయ్య

ABN , First Publish Date - 2021-12-05T04:54:38+05:30 IST

మాజీ సీఎం కొణిజేటి రోశయ్య గొప్ప రాజనీతిజ్ఞుడని, ఆయన చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ అన్నారు.

గొప్ప రాజనీతిజ్ఞుడు కొణిజేటి రోశయ్య
కోహెడలో నివాళులర్పిస్తున్న ఆర్యవైశ్య సంఘం నేతలు

  ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌


హుస్నాబాద్‌, డిసెంబరు 4: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య గొప్ప రాజనీతిజ్ఞుడని, ఆయన చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ అన్నారు. శనివారం ఆయన రోశయ్య మృతిపట్ల సంతాపం తెలిపారు. రోశయ్య రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని, నిరాడంబరమైన జీవితం గడిపారని, నైతిక విలువలతో జీవించారని కొనియాడారు. ఆయన జీవితం నేటి తరాలకు ఆదర్శప్రాయమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. 


కాంగ్రెస్‌ పార్టీకి చేసిన సేవలు మరువలేనివి


కొణిజేటి రోశయ్య కాంగ్రెస్‌ పార్టీకి చేసిన సేవలు మరువలేనివని నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మ శ్రీరాంచక్రవర్తి అన్నారు. రోశయ్య మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయనవెంట డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి, సింగిల్‌విండో చైర్మన్‌ బొలిశెట్టి శివయ్య, అక్కు శ్రీనివాస్‌, కోమటి సత్యనారాయణ, చిత్తారి రవీందర్‌, ఎండి హసన్‌ ఉన్నారు.


పలు గ్రామాల్లో ఘనంగా నివాళి


చేర్యాల: పట్టణంలో మాజీ సీఎం కొణిజేటి రోశయ్య ఫ్లెక్సీకి ఆర్యవైశ్య మహాసభ పట్టణాధక్షుడు నీల శివకుమార్‌ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కొండయ్య, లింగం, శంకర్‌, తాళ్లపల్లి శ్రీనివాస్‌, సంపత్‌, గందె అశోక్‌, విశ్వనాథం, ప్రవీణ్‌ పాల్గొన్నారు. వైశ్యభవన్‌లో ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యదర్శి లింగమూర్తి, నాయకులు వెంకటేశం, ఆంజనేయులు, తాటిపల్లి ఆంజనేయులు, జిల్లా రాజేశం, బుచ్చిరాములు, రవీందర్‌, గందె నర్సింహులు, ఉప్పల నాగరాజు, శేరి బాలనారాయణ, రాజేశం, కృష్ణమూర్తి నివాళులర్పించారు.

వర్గల్‌: మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం గజ్వేల్‌ డివిజన్‌ ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు బచ్చు పాండురంగం, మండలాధ్యక్షుడు బ్రాహ్మండ్లపల్లి వెంకటయ్య, మాజీ అధ్యక్షుడు విశ్వనాథం నివాళులర్పించారు.

కోహెడ: పట్టణంలో మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు నీల రవీందర్‌, మండలాధ్యక్షుడు మల్యాల కరుణాకర్‌, ఉపాధ్యక్షుడు మల్లేశం, నాయకులు ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, పీఆర్వో నీల వెంకటేశం పాల్గొన్నారు.


 

Updated Date - 2021-12-05T04:54:38+05:30 IST