పింఛన్ల మంజూరులో నిర్లక్ష్యం వీడాలి

ABN , First Publish Date - 2022-01-28T06:10:52+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండో సారి అధికారం చేపట్టినప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న పెన్షన్లను మంజూరు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉప సర్పంచ విఠల్‌ వెంకటేశ అన్నారు.

పింఛన్ల మంజూరులో నిర్లక్ష్యం వీడాలి
డీఆర్‌డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న అనంతారం గ్రామస్థులు

 

భువనగిరి రూరల్‌, జనవరి 27: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండో సారి అధికారం చేపట్టినప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న పెన్షన్లను మంజూరు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉప సర్పంచ విఠల్‌ వెంకటేశ అన్నారు. భువనగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన వితంతువులు, వృద్ధులు ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని డీఆర్‌డీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో దాదాపు 40మంది లబ్ధిదారులకు మూడేళ్ల నుంచి పెన్షన్లు మంజూరు కాకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌రెడ్డికి వినతి పత్రం అందచేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సింగిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఎర్ర మహేశ, దోనగిరి నితినకుమార్‌, పోల రాములు, ఎం.శ్రీధర్‌రెడ్డి, జి.వంశీ పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-28T06:10:52+05:30 IST