ధాన్యాన్ని త్వరగా తరలించాలి

ABN , First Publish Date - 2021-06-18T05:32:19+05:30 IST

ధాన్యాన్ని త్వరగా తరలించాలి

ధాన్యాన్ని త్వరగా తరలించాలి
ధాన్యాన్ని పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి

ఘట్‌కేసర్‌ రూరల్‌: వానాకాలం సీజన్‌ ప్రారం భం అవుతున్న సందర్భంగా వరి కొనుగోలు కేంద్రాల్లో మిగిలి ఉన్న ధాన్యాన్ని త్వరగా తరలించాలని మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్‌రెడ్డి అన్నారు. మండలంలోని ప్రతా్‌పసింగారం వరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శి ంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వానాకాలం సీజన్‌ ప్రారంభమైందని, రోజుల తరబడి రైతులు ధా న్యం కొనుగోలు కేంద్రాల చుట్టు తిరుగుతుంటే దుక్కు లు ఏలా చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని త్వరగా తరలించాలన్నారు. ప్రతా్‌పసింగారం కొనుగోలు కేంద్రంలో ఇంకా నాలుగువేల బస్తాల ధాన్యం తరలించాల్సా ఉందని  తెలిపారు. రాత్రి సమయాల్లో కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి మొలక వస్తోందని వాపోయారు. తర లించే వరకు ధాన్యం తడవకుండా నిర్వాహకులు చర్య లు తీసుకోవాలని సుధీర్‌రెడ్డి సూచించారు. అధికారు లు వెంటనే స్పందించి ధాన్యం తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పి.భాస్కర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సుభా ష్‌రెడ్డి, ఏఈవో జగదీష్‌, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T05:32:19+05:30 IST