కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి

ABN , First Publish Date - 2021-10-25T05:23:56+05:30 IST

రైతులు ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తాము పండించిన ఽధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని బోధన్‌ ఆర్డీవో రాజేశ్వర్‌ అన్నారు. ఆదివారం ఎడపల్లి మండల కేంద్రం శివారులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి
సాలూరలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం

ఎడపల్లి, అక్టోబరు 24: రైతులు ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తాము పండించిన ఽధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని బోధన్‌ ఆర్డీవో రాజేశ్వర్‌ అన్నారు. ఆదివారం ఎడపల్లి మండల కేంద్రం శివారులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ రజితాయాదవ్‌, ఎంపీపీ శ్రీనివాస్‌, ఎడపల్లి సహకార సంఘం చైర్మన్‌ పోల మల్కారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఇందులో ఉప సర్పంచ్‌ ఆకుల శ్రీనివాస్‌, ఏవో సిద్ధిరామేశ్వర్‌, ఎంపీటీసీ బాబా, రైతులు పాల్గొన్నారు.

బోధన్‌ రూరల్‌: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని సాలూర సొసైటీ చైర్మన్‌ అల్లె జనార్ధన్‌ అన్నారు. ఆదివారం మండలంలోని సాలూర గ్రామంలో స్థానిక సొసైటీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను దళాలరులకు విక్రయించి మోసపోవద్దని,  ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించి వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  సాలూర క్యాంప్‌, తగ్గేల్లి, ఫత్తేపూర్‌ గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో సాలూర సర్పంచ్‌ భూయ్యన్‌ చంద్రకళ రాచప్ప, సాలూర క్యాంపు సర్పంచ్‌ బి.శ్రీనివాసరావు, తగ్గేల్లి సర్పంచ్‌ లక్ష్మీ, ఎంపీటీసీ కన్నెల సవిత సంజీవ్‌, ఉప సర్పంచ్‌ సరిడే సాయిలు, సంఘ ఉపాధ్యక్షుడు సందీప్‌రెడ్డి, ఏవో సంతోష్‌, తదితరులు పాల్గొన్నారు. అలాగే, సాలంపాడ్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఎంపీపీ బుద్దె సావిత్రి, డీసీసీబీ డైరెక్టర్‌ గిర్ధావర్‌ గంగారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెంకటేశ్వర దేశాయ్‌, సొసైటీ చైర్మన్‌ బ్రహ్మరెడ్డి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.  

మోపాల్‌: గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని డీసీవో సింహాచలం తెలిపారు. ఆదివారం మోపాల్‌ మండలంలోని బాడ్సీ, మోపాల్‌  ప్రాథమిక సహకార సంఘాల ఆద్వర్యంలో కంజర్‌, బాడ్సీ, ముదక్‌పల్లి, నర్సింగ్‌పల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ధర్పల్లి జడ్పిటీసీ బాజిరెడ్డి జగన్‌ ప్రారంభించారు.  

నిజామాబాద్‌ రూరల్‌: రూరల్‌ మండలం ముత్తకుంట గ్రామంలో సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ సాంబారి మోహన్‌, దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌లు ప్రారంభించారు. ఆదివారం సొసైటీ పరిధిలటోని ముత్తకుంట గడ్రామంలో వరి ధాన్యం కొనుగోళ్లు షురూ చేశారు. ఈ సందర్భంగా సాంబరి మోహన్‌ మాట్లాడుతూ వరి ధాన్యం పూర్తిస్థాయిలో తడి ఆరిన తర్వాతనే సెంటర్‌కు తీసుకురావలని సూచించారు.  

ఏర్గట్ల: మండల కేంద్రంతో పాటు తాళ్లరాంపూర్‌ సొసైటీలో దాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉపాధ్యక్షుడు కుంట రమేష్‌ రెడ్డి, చైర్మన్‌లు బర్మ చిన్న నర్యయ్య, పెద్దకాపుల శ్రీనివాస్‌ రెడ్డిలు ప్రారంభించారు.  

కోటగిరి: మండలంలోని జల్లాపల్లి ఫారంలో ఆదివారం మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్‌ లావణ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 

నవీపేట: మండల కేంద్రంలో ఆదివారం నవీపేట సోసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ మద్దతుధర పొందాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ సంగెం శ్రీనివాస్‌, నవీపేట సొసైటీ చైర్మన్‌ అబ్బన్న, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మువ్వ నాగేశ్వర్‌ రావు, తదితరులున్నారు.

రెంజల్‌(నవీపేట): రెంజల్‌ మండల కేంద్రంలో ఆదివారం రెంజల్‌ సోసైటీతో పాటు ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని కోరారు. ఇందులో ఎంపీపీ రజిని, జడ్పీటీసీ విజయ, రెంజల్‌ సోసైటీ చైర్మన్‌ ప్రశాంత్‌, సర్పంచ్‌ రమేష్‌, తదితరులున్నారు.

Updated Date - 2021-10-25T05:23:56+05:30 IST