ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకురావాలి

ABN , First Publish Date - 2021-12-02T04:59:50+05:30 IST

రైతులు తమ ఇళ్ల వద్ద ఆరబెట్టిన ధాన్యాన్నే మార్కెట్‌కు తీసుకురావాలని మార్కెటింగ్‌ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు ఇఫ్తాకర్‌ అహ్మద్‌ పేర్కొన్నారు.

ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకురావాలి
గజ్వేల్‌ మార్కెట్‌లో ధాన్యాన్ని పరిశీలిస్తున్న ఇఫ్తాకర్‌ అహ్మద్‌

మార్కెటింగ్‌ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు ఇఫ్తాకర్‌ అహ్మద్‌

గజ్వేల్‌, డిసెంబరు 1 : రైతులు తమ ఇళ్ల వద్ద ఆరబెట్టిన ధాన్యాన్నే మార్కెట్‌కు తీసుకురావాలని మార్కెటింగ్‌ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు ఇఫ్తాకర్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. బుధవారం గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మాదాసు అన్నపూర్ణతో కలిసి మార్కెట్‌లోని ధాన్యాన్ని పరిశీలించి మాట్లాడారు. రైతులు ఇంటివద్దనే తాము పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకుని మార్కెట్‌కు తీసుకురావాలని సూచించారు. రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ సెక్రటరీ జాన్‌వెస్లీ, సూపర్‌వైజర్‌ మహిపాల్‌, నాయకులు రమే్‌షగౌడ్‌, మార్కెట్‌ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

గజ్వేల్‌: గజ్వేల్‌ మండలంలోని శ్రీగిరిపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ బుధవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలోని రైతులతో మాట్లాడారు. ధాన్యం, కాంటా, లారీల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఇన్‌చార్జి ఎంపీడీవో రాజే్‌షకుమార్‌, సర్పంచ్‌ చంద్రమోహన్‌రెడ్డి, ఏపీఎం యాదగిరి, రమే్‌షరెడ్డి, ఏఈవో గణేష్‌, టీఏ రవి, వీవోఏ కల్యాణి ఉన్నారు. 

మద్దూరు: తేమశాతం 16లోపు ఉంటేనే కాంటా పెడుతున్నారని, రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకురావాలని ఎంపీడీవో శ్రీనివాస్‌ సూచించారు. బుధవారం వల్లంపట్ల గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ట్రక్‌షీట్లను పరిశీలించారు. అనంతరం గ్రామ నర్సరీలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆయన వెంట నాయకులు యాదగిరి, ఆనందం, శ్రీశైలం, సెక్రటరీ సాయిబాబు, రైతులు ఉన్నారు. 

ములుగు: మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని డీసీవో చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం తునికిబొల్లారం, సింగన్నగూడ గ్రామాల్లోని కేంద్రాలను సందర్శించి మాట్లాడారు. ఆయన వెంట సీఈవో సిహెచ్‌.రమేష్‌, రైతులు ఉన్నారు. 

Updated Date - 2021-12-02T04:59:50+05:30 IST