ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-05-27T07:01:24+05:30 IST

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయా లని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అలీ అన్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అలీ

ప్రతి మండలంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలి

జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూఖీ అలీ

దస్తూరాబాద్‌, మే 26 : ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయా లని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అలీ అన్నారు. గురువారం మండలం లోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ అదనపు కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అకాలవర్షాల కారణంగా ధాన్యం నిల్వలు తడిసి పోయి ఇబ్బందులు కలుగకుండా కొనుగోళ్లను వేగవంతంగా చేపడుతూ సాధ్యమైనంత త్వరగా ధాన్యం సేకరణను పూర్తి చేసి మిల్లులకు తరలించాలని అన్నారు. ధాన్యం రవాణాకు ఇబ్బంది కలుగకుండా సరిపడా వాహనాలను సమకూర్చుకోవాలని, అవసరమైతే ప్రస్తుతం కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం లోడ్‌లతో వెళ్లే వాహనాల నుండి రైస్‌మిల్లుల వద్ద వెంటవెంటనే అన్లోడింగ్‌ జరిగేలా అధికారులు క్షేత్ర స్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన బిల్లుల చెల్లింపు ప్రక్రియ త్వరి తగతిన జరిగేలా అధికారులు చొరవ చూపాలని తెలిపారు. అనంత రం మండలంలోని రేవోజిపేట్‌ గ్రామంలో ప్లేగ్రౌండ్‌ కొరకు స్థల సేకరణను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడలకు ప్రా ధాన్యం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎకరం స్థలంలో ఆట స్థలం ఏర్పాటు నేపథ్యంలో గుర్తించిన ప్రభుత్వ స్థలాలను పరిశీలిం చారు. వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ, సింగిల్‌బార్‌, డబల్‌బార్‌ లాంటి ఆటలకు అనుకూలంగా ఉండేలా క్రీడాప్రాంగణాలను సిద్ధం చేయా లని అధికారులకు సూచించారు. జూన్‌ 2వ తేదీన ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రతి మండలానికి 5 ప్లే గ్రౌండ్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో తహసీల్దార్‌ జి. లక్ష్మి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంపీవో అనిల్‌ కుమార్‌, ఆర్‌ఐలు గంగన్న, వెంకట నర్సయ్య, పంచాయతీ కార్యదర్శులు ఇందుమతి, రాజేశ్వరి, గోవర్ధన్‌, ఏపీవో రవి ప్రసాద్‌, సర్పంచ్‌లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T07:01:24+05:30 IST