గవర్నర్‌ పర్యటనకు పటిష్ట బందోబస్తు

ABN , First Publish Date - 2022-10-05T05:01:50+05:30 IST

జిల్లా పర్యటనకు వస్తున్న రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు పటిష్ట బందోబస్తు చేపట్టారు.

గవర్నర్‌ పర్యటనకు పటిష్ట బందోబస్తు
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎస్పీ, అధికారులు

పుట్టపర్తి రూరల్‌, అక్టోబరు 4: జిల్లా పర్యటనకు వస్తున్న రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. బుధవారం జరగనున్న ప్రపంచ స్పేస్‌ వారోత్సవాలకు ముఖ్య అథితిగా గవర్నర్‌ హాజరవుతున్నారు. గవర్నర్‌ పర్యటనను దృష్టిలో ఉంచుకుని పుట్టపర్తిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గవర్నర్‌ పర్యటనను ఐదుగురు డీఎస్పీలు, పది మంది సీఐలు, 25 మంది ఎస్‌ఐలు పర్యవేక్షిస్తారన్నారు. అదేవిధంగా 50 మంది ఏఎ్‌సఐలు, 160 మంది కానిస్టేబుళ్లు, 25 మంది మహిళా కానిస్టేబుళ్లు, 150 మంది హోంగార్డులు, ఐదు స్పెషల్‌ పార్టీ పోలీస్‌ బృందాలు బందోబస్తులో పాల్గొంటాయని ఎస్పీ వెల్లడించారు. 


గవర్నర్‌ పర్యటన ఇలా...


పుట్టపర్తి: రాష్ట్రగవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన బుధవారం పుట్టపర్తికి వస్తున్నట్లు కలెక్టర్‌ బసంతకుమార్‌ ఓప్రకటనలో తెలిపారు. గవర్నర్‌ 5వ తేది ఉదయం 10 గంటలకు గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.10 నిముషంలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రత్యేక కాన్వాయిలో శాంతిభవనకు చేరుకుంటారు. 11:30 నుంచి 11.40 వరకు శాంతిభవనలో విశ్రాంతి తీసుకుంటారు. 11.45 నుంచి 11.55 వరకు  సాయికుల్వంత మందిరంలో జరిగే దసరా ఉత్సవాల్లో పాల్గొని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. అనంతరం 12 గంటలకు సత్యసాయి ఇంటర్‌నేషనల్‌స్పోర్ట్సు స్టేడియానికి చేరుకుంటారు. ఒంటి గంట వరకు ప్రపంచ స్పేస్‌ వారోత్సవాల్లో పాల్గొంటారు. తిరిగి 1.05కు శాంతిభన చేరుకుంటారు. 2గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. 2 గంటలకు ప్రత్యేక కాన్వాయిలో బయలుదేరి పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30కు ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరానికి వెళ్తారు. 



Updated Date - 2022-10-05T05:01:50+05:30 IST