Abn logo
Oct 27 2021 @ 23:57PM

నేడు స్వగ్రామానికి మిజోరం గవర్నర్‌ రాక

గ్రామంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బలరాం, డీపీవో నారాయణరెడ్డి తదితరులు

స్వాగత ఏర్పాట్లలో ఎమ్మెల్యే బలరాం, అధికారులు 

మధ్యాహ్నం వరకు గ్రామంలో గడపనున్న డాక్టర్‌ హరిబాబు


ఒంగోలు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మిజోరం రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ కంభంపాటి హరిబాబు తన స్వస్థలమైన నాలుగుప్పలపాడు మండలం తిమ్మ సముద్రం గ్రామానికి గురువారం వస్తున్నారు. కు టుంబపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ యన వస్తున్నట్లు సమాచారం. అయితే సుదీర్ఘకా లంగా విశాఖలో నివాసం ఉంటున్న హరిబాబు ఆంధ్రావర్శిటీ ప్రొఫెసర్‌గా, బీజేపీ కీలక నేతగా అక్కడి ఎమ్మెల్యే, ఎంపీగా ఏ హోదాలో పనిచేస్తున్న గ్రామంలో నిత్యం సంబంధాలు కొనసాగిస్తుండేవా రు. కాగా జిల్లాలో రాజకీయ ప్రముఖుడు, ప్రస్తుత చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తితో అ త్యంత సన్నిహితంగా ఉండేవారు. కాగా ఇటీవల మిజోరం గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన హరిబా బు ఆ హోదాలో స్వగ్రామమైన తిమ్మసముద్రంకు తొలిసారి వస్తున్నారు. అందిన సమాచారం మేరకు గురువారం ఉదయం 9గంటలకు విజయవాడలో బయలుదేరి 10.30గంటలకు తిమ్మసముద్రం చేరు కుంటారు. మధ్యాహ్నం వరకు అక్కడ గడపనున్నా రు. ఈక్రమంలో తనకు అత్యంత సన్నిహితుడు, గ్రా మవాసి అయిన గవర్నర్‌ హరిబాబు తొలిసారి స్వగ్రామానికి వస్తుండటంతో అందుకు సంబంధిం చి ఏర్పాట్లపై ఎమ్మెల్యే బలరాం దృష్టి పెట్టారు. గ్రా మ మాజీ సర్పంచ్‌ కరణం రమేష్‌బాబు, సొసైటీ మాజీ అధ్యక్షుడు ముద్దన ఉమామహేశ్వరరావు ఇ తర గ్రామపెద్దలతో కలిసి రెండురోజులుగా గ్రామం లో పర్యటించి అవసరమైన ఏర్పాట్లలో నిమగ్న మయ్యారు. ఇదిలా ఉండగా గవర్నర్‌ హోదాలో జి ల్లాకు వస్తున్న హరిబాబుకు జిల్లా యంత్రాంగం త రుపున స్వాగతంతో పాటు అవసరమైన ప్రొటోకాల్‌ ఏర్పాట్లలో అధికార యంత్రాంగం కూడా చర్యలు చేపట్టింది. డీపీవో నారాయణరెడ్డి నేతృత్వంలో అధి కారులు బుధవారం తిమ్మసముద్రం సందర్శించి ఎ మ్మెల్యే బలరాంతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. గవర్నర్‌ హరిబాబు దంపతులతో పాటు బీజేపీ జా తీయ నాయకురాలు దగ్గుబాటి పురందీశ్వరి, మాజీ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌లు కూడా వస్తు న్నట్లు సమాచారం.