Abn logo
Apr 16 2021 @ 23:46PM

జిల్లాలో కొవిడ్‌ పరిస్థితులపై గవర్నర్‌ ఆరా

ఆదిలాబాద్‌టౌన్‌, ఏప్రిల్‌ 16: జిల్లాలో వందల్లో పెరుగుతున్న కేసుల దృష్ట్యా గవర్నర్‌ తమిలిసై సౌందర్యరాజన్‌ రాష్ట్ర ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, డిస్ర్టిక్‌ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె జిల్లా చైర్మన్‌ గంగేశ్వర్‌తో మాట్లాడి జిల్లా పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజన గ్రామాలైనటువంటి బురికి, మాంగ్లి అనే గ్రామాలను కొన్ని రోజుల క్రితమే సందర్శించి వారి స్థితిగతుల గురించి తెలుసుకున్నామన్నామని గంగేశ్వర్‌ తెలిపారు.  మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు మాస్కులు, సబ్బులు అందజేశామని తెలిపారు. ఈ సమావేశంలో స్టేట్‌ ఎంసీ మెంబర్‌ విజయ్‌బాబు, నేరడిగొండ కో ఆర్డినేటర్‌ కుంట కిరణ్‌కుమార్‌రెడ్డి, లైఫ్‌మెంబర్‌ పుప్పాల కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement