38 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఇక రెగ్యులర్‌.. 1406 పోస్టుల మంజూరు

ABN , First Publish Date - 2022-05-16T17:09:03+05:30 IST

రాష్ట్రంలోని 38 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను రెగ్యులర్‌ కోర్టులుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది. వాటిని 22 అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి, 16 సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులుగా స్థాయి పెంచింది. ఈ మేరకు న్యాయశాఖ ఇన్‌ఛార్జ్‌ కార్యదర్శి ఎంఏ మన్నన్‌ ఫరూఖీ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త జిల్లాలో 16 సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు ప్రజలకు సత్వర న్యాయం...

38 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఇక రెగ్యులర్‌.. 1406 పోస్టుల మంజూరు

ప్రభుత్వ ఉత్తర్వులు జారీ


హైదరాబాద్‌, మే 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 38 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను రెగ్యులర్‌ కోర్టులుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది. వాటిని 22 అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి, 16 సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులుగా స్థాయి పెంచింది. ఈ మేరకు న్యాయశాఖ ఇన్‌ఛార్జ్‌ కార్యదర్శి ఎంఏ మన్నన్‌ ఫరూఖీ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త జిల్లాలో 16 సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు ప్రజలకు సత్వర న్యాయం అందజేస్తాయని తెలిపారు. రెగ్యులర్‌గా మార్చిన 38 కోర్టులతో పాటు మరో 14 అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టుల్లో 1406 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను ఆర్థికశాఖ ప్రత్యేకప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జారీ చేశారు. అందులో అదనపు జిల్లా కోర్టుల్లో 990, సివిల్‌ జడ్జి కోర్టుల్లో 416 పోస్టులున్నాయి. రెగ్యులర్‌ అయిన 22 అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి కోర్టుల్లో ఒక్కో జిల్లా జడ్జి, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, సూపరింటెండెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. జూనియర్‌ అసిస్టెంట్‌ ఐదు పోస్టులు, టైపిస్ట్‌ రెండు పోస్టుల  చొప్పున మంజూరు చేసింది. అదనపు జిల్లా కోర్టుల్లో ఖాళీలు(990): జిల్లా జడ్జి-22, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌-36, సూపరింటెండెంట్‌(హెడ్‌ క్లర్క్‌)-36, సూపరింటెండెంట్‌(ట్రాన్స్‌లేటర్‌)-36, సీనియర్‌ అసిస్టెంట్‌-36, స్టెనోగ్రాఫర్‌ -36, జూనియర్‌ అసిస్టెంట్‌ - 152, టైపిస్ట్‌ - 58, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ - 94, ఎగ్జామినర్‌ - 36, కాపీయిస్ట్‌ - 36, ప్రాసెస్‌ సర్వర్‌ - 138, డ్రైవర్‌ - 36, రికార్డు అసిస్టెంట్‌ - 36, ఆఫీసర్‌ సబార్డినేట్‌ - 180 ఫుల్‌టైం మసలాచి - 22.సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుల్లో ఖాళీలు(416): సీనియర్‌ సివిల్‌ జడ్జి - 16, సూపరింటెండెంట్‌ - 16, సీనియర్‌ అసిస్టెంట్‌(హెడ్‌ క్లర్క్‌) 16, సీనియర్‌ అసిస్టెంట్‌(యూడీబీసీ) - 16, స్టెనోగ్రాఫర్‌ - 16, జూనియర్‌ అసిస్టెంట్‌ - 80, టైపిస్ట్‌-32, ఫీల్డ్‌ అసిస్టెంట్‌-32, ఎగ్జామినర్‌-16, కాపీయిస్ట్‌-16, ప్రాసెస్‌ సర్వర్‌-48, రికార్డు అసిస్టెంట్‌-16, ఆఫీస్‌ సబార్డినేట్‌ -80, ఫుల్‌టైం మసలాచి-16.

Updated Date - 2022-05-16T17:09:03+05:30 IST