నాయీ బ్రాహ్మణులపై సర్కారు చిన్నచూపు

ABN , First Publish Date - 2021-09-08T17:58:49+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులను..

నాయీ బ్రాహ్మణులపై సర్కారు చిన్నచూపు

స్టేషన్‌ఘన్‌పూర్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులను చిన్న చూపు చూస్తోందని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్‌ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు కరెంట్‌ ఉచితంగా అందిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ అమలు చేయలేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సెలూన్‌ షాపుల ఏర్పాటు కోసం రూ.1లక్ష సబ్సీడీ పై రుణాలు ఇస్తామని విస్మరించారని అన్నారు. ఇచ్చిన హమీలు నెరవేర్చకుంటే సీఎం కుటుంబానికి తమ సేవలను నిలిపివేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు నరేష్‌, వేణు, శ్రీనివాస్‌, ఐలయ్య, రవి, రాజయ్య, రాజు, రాము, శివ, వెంకటేష్‌, సతీష్‌, మహేందర్‌, రమేష్‌, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-08T17:58:49+05:30 IST