Abn logo
Sep 25 2021 @ 00:36AM

సమస్యల పరిష్కారినికి ప్రభుత్వం కృషి చేయ్యాలి

సబ్యత్వ నమోదు చేస్తున్న ఉపాద్యాయ సంఘ నాయకులు

- ఎస్‌టీయూటీఎస్‌ జిల్లా అధ్యక్షుడు బైరం హరికిరణ్‌

కోరుట్ల, సెప్టెంబరు 24 : దీర్ఘకాలికంగా పాఠశాలల్లో అపరిష్కృతంగా నెలకొన్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఎస్‌టీ యూటీఎస్‌ జిల్లా అధ్యక్షుడు బైరం హరికిరణ్‌ డిమాండ్‌ చేశారు. శుక్ర వారం పట్టణంతో పాటు మండలంలోని వివిధ పాఠశాలలో ఎస్‌టీయూ టీఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ శంకర్‌తో కలిసి నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యా యులకు సభ్యత్వాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 15 ఏళ్ల నుంచిఎంఈఓ పోస్టుల భర్తీ చేయకపోవడంతో పర్యవేక్షణ క రువైందన్నారు. రెండు మూడు మండలాలకు ఒక్కరికి ఎంఈఓగా ఇన్‌ చార్జిలను ఇస్తూ ప్రభుత్వం కాలం గడుపుతోందని అన్నారు. విద్యావలం టీర్ల నియమాకం చేపట్టాలని అన్నారు. రేషనలైజేషన్‌ పేరుతో పాఠశాల ల మూసివేత సరికాదని దీని వల్ల పేద, మద్య తరగతి విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. పండిత పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్‌లో జరుగుతున్న జాప్యాన్ని త్వరగా పరిష్కరించి పెండింగ్‌ లో డీఏ బకాయలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టీయూ కోరుట్ల మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు పాలెపు శివరామకృష్ణ, సాయికుమార్‌, కథలాపూర్‌ కార్యదర్శులు రాజ్‌కిర ణ్‌, ఆడెపు రాజశేఖర్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.