ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వాహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-06-30T11:43:51+05:30 IST

ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహించుకునే అవకాశాన్ని ప్రైవేటు విద్యాసంస్థలకు కల్పించాలని ప్రభుత్వాన్ని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వాహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి

శాంతిపాదయాత్రలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు


నర్సంపేట, జూన్‌ 29 : ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహించుకునే అవకాశాన్ని ప్రైవేటు విద్యాసంస్థలకు కల్పించాలని ప్రభుత్వాన్ని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు కోరారు. సోమవారం నర్సంపేటలోని అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి వరంగల్‌ రోడ్‌ వరకు  ట్రస్మా ఆధ్వర్యంలో శాంతి పాదయాత్రను నిర్వహించారు. ఆన్‌లైన్‌ క్లాసులకు అనుమతించడంతోపాటు కేరళ ప్రభుత్వం తరహాలో రాష్ట్ర ప్రభుత్వమే విద్యార్థులకు, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, ట్యాబ్‌లను అందించాలని కోరారు. కార్యక్రమంలో నిసా జాతీయ కమిటీ సభ్యుడు పరంజ్యోతి, రాష్ట్ర బాధ్యులు బుచ్చిబాబు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు, చంద్రారెడ్డి, సతీష్‌బాబు, కంది గోపాల్‌రెడ్డి, మోతె సమ్మిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-30T11:43:51+05:30 IST