తడిసిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2021-11-27T06:18:01+05:30 IST

తడిసిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే జయమంగళవెంకటరమణ కోరారు.

తడిసిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి
తామరకొల్లులో మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీస్తున్న జయమంగళ

మాజీ ఎమ్మెల్యే జయమంగళవెంకటరమణ 

కైకలూరు, నవంబరు 26 : తడిసిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే జయమంగళవెంకటరమణ కోరారు.  కైకలూరు మండలం తామరకొల్లులో దెబ్బతిన్న పంటపొలాలను, తడిసిన ధాన్యాన్ని శుక్రవారం పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు.  ప్రభుత్వం ఇప్పటికీ పంటనష్టాలను అంచనా వేయడంలో వైఫల్యం చెందిందన్నారు.  అధికారులు దెబ్బతిన్న పంటపొలాలపై ఆరా తీయలేదన్నారు. ఎకరానికి రూ20వేలు ఖర్చుపెట్టి పంటలుపండించిన రైతులకు చేతికివచ్చే సమయంలో వర్షాలు దెబ్బతీశాయని, తడిసిన ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసినా కనీసం కూలీల ఖర్చులు రావడం లేదని రైతులు వాపోతున్నారన్నారు. రైతులకు పంటనష్టపరిహారం తక్షణమే అందించడమేకాక, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.  రాష్ట్ర తెలుగురైతు అధికార ప్రతినిధి సయ్యపురాజు గుర్రాజు, మహిళా నాయకురాలు పోలవరపు లక్ష్మీరాణి, పి.రాధాకృష్ణ, కూరెళ్ళ ఇస్సాక్‌, నున్న శ్యామలరాజు, నున్న పిచ్చయ్య, కూరెళ్ళ నవీన్‌, చిన్నం కిషోర్‌, నేరెళ్ళ వంశీ  పాల్గొన్నారు.


Updated Date - 2021-11-27T06:18:01+05:30 IST