మొక్కజొన్న సాగుకు ప్రభుత్వం అనుమతివ్వాలి

ABN , First Publish Date - 2020-05-24T09:43:35+05:30 IST

ప్రభుత్వం సూచించిన పంట వేస్తేనే రైతుబంధు ఇస్తామని చెప్పడం సరికాదని డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి మండిపడ్డారు.

మొక్కజొన్న సాగుకు ప్రభుత్వం అనుమతివ్వాలి

డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి


పరిగి(రూరల్‌): ప్రభుత్వం సూచించిన పంట వేస్తేనే రైతుబంధు ఇస్తామని చెప్పడం సరికాదని డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం పరిగి వ్యవసాయ కార్యాలయం వద్ద స్థానిక కాంగ్రెస్‌ నాయకులతో కలసి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సాగునీటి వసతి లేని పరిగి ప్రాంత రైతులు మొక్కజొన్న సాగు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని ఏడీఏ వీరప్పకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు.


వెనుకబడిన పరిగి నియోజకవర్గ రైతాంగానికి సాగు నీటి సాదుపాయం లేదని వర్షాధారమే జీవనాధారమన్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా పత్తి సాగుకు అన్ని నేలలు అనుకూలంగా లేవని కొన్ని నేలల్లో మొక్కజొన్న మాత్రమే సాగవుతాయని చెప్పారు. మొక్కజొన్న సాగుకు రైతులు మక్కువ చూపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కృష్ణ, నాయకులు హనుమంతు, చిన్న నర్సింహులు, రియాజ్‌, ఆంజనేయులు, పరశురాంరెడ్డి, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-24T09:43:35+05:30 IST