Abn logo
May 6 2021 @ 00:53AM

కరోనాపై ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి

హిందూపురం టౌన, మే 5: కరోనా ఉదృతి వేగవంతం అవుతుండటంతో అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం కూడా బాధ్యతగా వహించాలని అఖిలపక్షం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం నాయకులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్‌, బాలాజీమనోహర్‌, డీఈ రమేష్‌, ఉమర్‌ఫారూక్‌, శ్రీరాములు, వెంకటేశ మాట్లాడుతూ ప్రతి మండలంలో మూడు కరోనా టెస్టింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. 24 గంటల్లోపు ఫలితాలు ప్రకటించాలన్నారు. లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ క్వారంటైనలో పెట్టాలన్నారు. ఆక్సిజన కొరత లేకుండా చూడాలన్నారు. ఆక్సిజన సరఫరా చేస్తున్న ప్రైవేట్‌ యాజమాన్యాలకు వెంటనే బిల్లులు మంజూరు చేయాలన్నారు. అఖిలపక్షం కమిటీ ఆధ్వర్యంలో కరోనా వ్యాధి గ్రస్థులకు బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు, వంట సరుకులను దాతల సహకారంతో అందిస్తామన్నారు. తూముకుంట పారిశ్రామిక వాడలోని ఆక్సిజన ప్లాంట్‌ వద్ద గురువారం నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, రాము, నవీన, దాదాపీర్‌, అంజాద్‌, ఫయాజ్‌, నూరుల్లా, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. 
Advertisement