Abn logo
Sep 27 2021 @ 00:56AM

ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్యెల్యే గుజ్జుల

- పెద్దపల్లి మాజీ ఎమ్యెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి

పెద్దపల్లి, సెప్టెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకోని సీఎం కేసీఆర్‌ వరి వేస్తే రైతుకు ఉరేనని రైతులను ఆందోళనకు గురిచేస్తు న్నాడని, ప్రతి వరిగింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సిందేనని పెద్దపల్లి మాజీ ఎమ్యెల్యే, బీజేపీ సీనియర్‌ నాయకుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్ట్‌ కరెంట్‌ బిల్లులు రూ.రెండు వేల కోట్లు చెల్లిస్తున్నారన్నారు. రైతులకు సాగునీరు అందుతున్న తరు ణంలో ఎక్కువ మంది వరిపంటను సాగు చేస్తున్నారన్నారు. గతంలో ఇక్కడి రైతులు అధికంగా పత్తిపంటను పండించారని, పత్తిపంటతో నష్టాలు రావడంతో వరిసాగు పెంచారు తప్ప ఈ ప్రాజెక్ట్‌వలన ఒక్కఎకరం కూడా అదనంగా సాగు పెరగలేదని పేర్కోన్నారు. కేంద్రం వరిదాన్యాన్ని కొనుగోళ్ళు చేయడం లేదని బదనాం చేస్తు వరిసాగు చేయవద్దని సీఎం కేసీఆర్‌ రైతులను గందరగోలానికి గురిచేస్తున్నా రన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని రైస్‌బాల్‌ ఆఫ్‌ ఇండియా పేరు వచ్చిందని చెబుతున్న సీఎం కేసీఆర్‌ ఇప్పుడు వరిధాన్యాన్ని ఎందుకు కొనుగోళ్ళు చేయడం లేదని ప్రశ్నించారు. జాల భూముల్లో ఆరుతడి పంటలు వేస్తే అవి చేతికి ఎలా వస్తాయో తెలపాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోళ్ళు చేయాల్సిందేనని ఆయన ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. అలాగే తెలంగాణ వచ్చిన నాటి నుంచి గడిచిన ఏడేళ్లలో ప్రభుత్వం వన్‌వన్‌ కొనుగోలు కేంద్రాల ద్వారా వరిపంటను కొనుగోలు చేసి రూ. 3975 కోట్లు నష్టపోవడం జరిగిందని చెబుతున్నారు. ఇప్పుడు కూడా అదేవిదంగా వరిధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోళ్ళు చేయాల్సిందేనన్నారు. ధరిణి పోర్టల్‌ ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పదిమాసాలు అవుతున్న కూడా అందు లో ఉన్న లోపాలను సవరించకపోవడంతో రైతులు కార్యాలయాల చుట్టు తిరుగు తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి పాలన జరుగు తున్నదని ప్రజారంజకంగా లేదని ఆయన విమర్శించారు. వరిసాగు విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని రైతులకు అండగా బీజేపీ పార్టీ నిలుస్తుందని ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోళ్ళు చేసేవరకు రైతుల పక్షాన పోరాటం రామకృ ష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు రామ్‌సింగ్‌, పిన్నింటి రాజు, పరుశసమ్మయ్య, వెళ్ళంపల్లి శ్రీనివాస్‌రావు, చిలువేరు ఓదెలు, పల్లెసదానందం, ఫ హీం, తిరుపతి, తూడిరవి, కొమిశెట్టి రమేష్‌, మోరమనోహర్‌, మంథని కృష్ణ, కాసం గొట్టు విజయ్‌, చాట్లకొండల్‌, సోడాబాబు తదితరులున్నారు.