‘రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న సర్కారు’

ABN , First Publish Date - 2022-08-11T07:00:24+05:30 IST

రెవెన్యూ వ్యవస్థను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వీర్యం చేస్తున్నారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మ హేశ్వర్‌ రెడ్డి ఆరోపించారు. మండలకేంద్రంలో కొనసాగుతున్న వీఆర్‌ఏల సమ్మె కు బుధవారం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇ ప్పటికే వీఆర్‌వోల వ్యవస్థకు మంగళం పాడి అతీగతి లేకుండా చేశారని, ఇచ్చిన హామీని కూడా తుంగలో తొక్కాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరిం చారు.

‘రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న సర్కారు’

లక్ష్మణచాంద, ఆగస్టు 10: రెవెన్యూ వ్యవస్థను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వీర్యం చేస్తున్నారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మ హేశ్వర్‌ రెడ్డి ఆరోపించారు. మండలకేంద్రంలో కొనసాగుతున్న వీఆర్‌ఏల సమ్మె కు బుధవారం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇ ప్పటికే వీఆర్‌వోల వ్యవస్థకు మంగళం పాడి అతీగతి లేకుండా చేశారని, ఇచ్చిన హామీని కూడా తుంగలో తొక్కాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరిం చారు. దళిత బిడ్డలు, బడుగు బలహీన వర్గాల బిడ్డలే అధికంగా వీఆర్‌ఏలుగా కొనసాగుతున్నారని, కుటుంబం మొత్తానికి పదవులు ఇచ్చి అత్యధికంగా జీ తాలు పెంచిన కేసీఆర్‌ బడుగు ప్రజలను పట్టించుకోకపోవడం ముమ్మాటికీ వి వక్షే అవుతుందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సాక్షిగా వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీ ని వెంటనే అమలు చేయాలని, లేదంటే ఉద్యమిస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్ర భుత్వం వస్తే వీఆర్‌ఏలకు పే-స్కేల్‌, పదోన్నతులకు సంబంధించిన ఫైల్‌పై మొదటి సంతకం పెట్టేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ బ్లాక్‌ అధ్యక్షుడు సరికెల గంగన్న, దిలావర్‌పూర్‌ జడ్పీటీసీ తక్కల రమణారెడ్డి, లక్ష్మణచాంద ఎంపీటీసీ గడ్డం నర్సారెడ్డి, నాందేడపు చిన్ను పాల్గొన్నారు. 

ప్రజలను మభ్య పెడుతున్న మంత్రి

నిర్మల్‌ కల్చరల్‌: మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అబద్ధాలాడుతూ ప్రజలను మభ్య పెడుతున్నారని ఏఐసీసీ నాయకుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బడ్జెట్‌ అలాట్మెంట్‌లో నిర్మల్‌ పేరు లేకపోవడం శోచనీయమన్నారు. మెడికల్‌ కాలేజీ పేరుతో ప్రజలను వంచించే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. రైల్వేలైన్‌ మంజూరు, నిర్మల్‌లో అండర్‌ డ్రైనేజీ సిస్టం ఏర్పాటులో విఫలమాయ్యరని అన్నారు.

Updated Date - 2022-08-11T07:00:24+05:30 IST