అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధం : మోదీ

ABN , First Publish Date - 2021-11-29T16:58:33+05:30 IST

పార్లమెంటులో అన్ని ప్రశ్నలను ఎదుర్కొని, సమాధానం

అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధం : మోదీ

న్యూఢిల్లీ : పార్లమెంటులో అన్ని ప్రశ్నలను ఎదుర్కొని, సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అయితే సభ గౌరవాన్ని, సభాపతి సమగ్రతను కాపాడాలని తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవడానికి ముందు మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వం ఎదురు చూస్తోందన్నారు. సభా కార్యకలాపాలు సజావుగా జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో సకారాత్మక కృషి జరగడం ముఖ్యమని చెప్పారు. పార్లమెంటులో చర్చించాలని, సభ గౌరవ, మర్యాదలను కాపాడాలని చెప్పారు. వాయిదాలు, అంతరాయాలు కాకుండా అర్థవంతమైన చర్చ జరిగిందని ఈ సమావేశాలు గుర్తుండిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 


అనంతరం సోమవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఇటీవల కొందరు సభ్యుల మృతి పట్ల సంతాపం తెలియజేసే తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చదివారు. అనంతరం సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. రాజ్యసభ గంట సేపు వాయిదా పడింది. 


Updated Date - 2021-11-29T16:58:33+05:30 IST