బలిజలను అణగదొక్కుతున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-06-27T04:52:18+05:30 IST

బలిజలపై రాష్ట్ర ప్రభుత్వం దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వ తీరుపై ఆదివారం బలిజ సంఘం నేతలు నిరసన తెలిపారు.

బలిజలను అణగదొక్కుతున్న ప్రభుత్వం
నిరసన ప్రకటిస్తున్న బలిజ సంఘం నేతలు

హత్య కేసులో సాక్షులను కాపాడాలి - ఎస్‌ఐ, సీఐలను సస్పెండ్‌ చేయాలి 

చిత్తూరు మాజీ మేయర్‌ కఠారి హేమలతపై పోలీసుల తీరు అమానుషం

బలిజ సంఘం నాయకుడు బాలిశెట్టి హరిప్రసాద్‌ డిమాండ్‌ 

కడప(ఎర్రముక్కపల్లి), జూన్‌ 26: బలిజలపై రాష్ట్ర ప్రభుత్వం దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వ తీరుపై ఆదివారం బలిజ సంఘం నేతలు నిరసన తెలిపారు. కడప నగరంలోని శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి నివాళులర్పించిన ఆయన మాట్లాడుతూ కఠారి మోహన్‌ దంపతుల హత్య కేసులోని సాక్షుల ను బెదిరించడం దారుణమన్నారు. సాక్షులను లొం గదీసుకోవడంలో పోలీసుల తీరు దారుణమన్నారు. ప్రత్యర్థివర్గ అనుచరులతో కుమ్మక్కై సాక్షులపై అక్ర మ కేసులు బనాయిస్తామని పోలీసులు బెదిరిస్తు న్నారని ఆరోపించారు.

విషయంలో హేమలత చి త్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్‌రెడ్డిని కలిసి సాక్షులను కాపాడాలని రెప్రజెంటేషన్‌ ఇచ్చినా ఎలాంటి న్యాయం జరగక పోగా హేమలత, వారి అనుచరులు, సాక్షు ల ఇండ్లలో పోలీసులు గంజాయి పెడతారని అడ్డుకునేందుకు సాక్షుల ఇళ్ల దగ్గర ధర్నాకు కూర్చుని న్యాయం చేయాలని కోరారు. ఈసమయంలో చిత్తూ రు సీఐ యతీంద్ర పోలీసు వాహనంతో హేమల తను ఢీకొనడంతో ఆమె నడుము తుంటి విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. పోలీసుల అప్రజాస్వామిక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎస్‌ఐ, సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాం డ్‌ చేశారు. శాంతిభ ద్రతలను కాపాడే పోలీసు వ్యవస్థ ఈ రోజు అధికార మదబలంతో పరిపాలన సాగిస్తున్న జగన్‌రెడ్డి ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.హేమలతకు, వారి కుటుంబ సభ్యులకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు.

రాష్ట్రంలో బలిజ లు టీడీపీ మద్దతుదారులని రాజకీయ కక్షతో వారి పై తప్పుడు కేసులు బనాయయిస్తున్నారని ఆరోపిం చారు. మొన్న మాజీ మంత్రి నారాయణ, నిన్న హే మలతపై తప్పుడు కేసులు బనాయించడం బలిజలను అణగదొక్కడమేనన్నారు. సాక్షులను కాపాడాలని పోలీసులను కోరితే సీఐ జీపుతో దాడి చేయడ మే కాకుండా విధులకు భంగం కలిగించారని రివ ర్స్‌ కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. బలిజ సంక్షేమ సంఘం నేతలు, గోపిశెట్టి నాగరాజు, తోట రామచంద్రయ్య, గంధం ప్రసాద్‌,  పసుపులేటి శంకర్‌, చిట్టెం రామచంద్రయ్య, రాజగోపాల్‌, వాసా చలపతి, శంక ర్‌, శ్రీరాములు సుబ్బయ్య, నరసింహులు, రామ్మోహన్‌, గాజుల సుబ్రహ్మణ్యం, బండారు జయరాం, బం డిబాబు, సత్య, రమణమూర్తి, మస్తాన్‌, సాయి, కృష్ణమూర్తి, రెడ్డిప్రసాద్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-27T04:52:18+05:30 IST