ప్రజలను పీక్కుతింటున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-08-10T05:16:55+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అ ధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల చార్జీలు, ధరలను పెంచి ప్రజలను పీక్కుతింటున్నదని ఎ మ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు.

ప్రజలను పీక్కుతింటున్న ప్రభుత్వం

బాదుడేబాదుడులో ఎమ్మెల్యే స్వామి ధ్వజం


పొన్నలూరు, ఆగస్టు 9: వైసీపీ ప్రభుత్వం అ ధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల చార్జీలు, ధరలను పెంచి ప్రజలను పీక్కుతింటున్నదని ఎ మ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు. రాష్ట్ర ఆదాయం తగ్గి, సామాన్యు లపై బాదుడు పెరిగిందని ధ్వజమెత్తారు. మండ లంలోని జడ్‌.మేకపాడు, కోటపాడు, చెన్నిపాడు, వెంకుపాలెం గ్రామాల్లో మంగళవారం  నిర్వహిం చిన బాదుడే బాదుడు కార్యక్రమాల్లో ఆయన పా ల్గొని మాట్లాడారు. టీడీపీ హయాంలో పేదలు, దళితుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అ మలు కాగా, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఒకచేత్తో తక్కువ డబ్బులు ఇచ్చి, చార్జీలు, నిత్యావసరాల ధరలను భారీగా పెంచి మరోచేత్తో అధిక మొత్తం లాగేసుకుంటున్నదని దుయ్యబట్టారు. ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్న వైసీపీకి బుద్ధి చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి దామచర్ల సత్యన్నారాయణ మాట్లాడుతూ జగన్‌ పాలనలో రాష్ట్రం అధోగతిపా లైందని విమర్శించారు. బూటకపు హామీలిచ్చి అ ధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజలను అడుగడు గునా వంచిస్తున్నదని ధ్వజమెత్తారు. ఈసందర్భం గా ఆయా గ్రామాల్లో టీడీపీ జెండాలను ఆవిష్క రించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు అనుమోలు సాంబశివరావు, నాయకులు మండవ ప్రసాద్‌, కొండ్రగుంట శ్రీనివాసరావు, కర్ణా కోటిరె డ్డి, పిల్లి వెంకటనారాయణరెడ్డి, కాటూరి మాధవ రావు, సుధాకర్‌, కోటపాడు నాయకులు బోయాల రమణారెడ్డి, బాలకృష్ణారెడ్డి, కృష్ణమూర్తి, చెన్నిపా డు నాయకులు తాడిబోయిన వెంకటరమణయ్య, రమణారెడ్డి, మాలకొండారెడ్డి, బిరుదల ఆరోను, వెంకుపాలెం నాయకులు తానికొండ మహేంద్ర, మాదాల ప్రసాద్‌, సర్పం


Updated Date - 2022-08-10T05:16:55+05:30 IST