పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-08-19T05:49:16+05:30 IST

పేదల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తుందని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌ చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.

పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ప్రభుత్వం
లబ్ధిదారులకు పత్రాలు అందజేస్తున్న కృష్ణచైతన్య

 శాప్‌నెట్‌ చైర్మన్‌ కృష్ణచైత న్య

అద్దంకి, ఆ గస్టు 18: పేదల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తుందని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌ చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. మండ లంలోని గోపాలపురంలో గడప గడపకు మ న ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురు వారం సాయంత్రం ఇంటింటికి తిరిగి ప్రభు త్వం అందిస్తున్న లబ్ధిని  వివరించారు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ గోపాలపురంలో పేదల నివేశన స్థలాలుగా నామ్‌ రోడ్డు కు అత్యంత సమీపంలో విలువైన స్థలాలు కేటాయించినట్టు చెప్పారు. ఇళ్ళ నిర్మాణంకు అడ్డంగా ఉన్న విద్యుత్‌ లైన్లను కూడా తొలగింపు పనులు చేపట్టినట్లు తెలిపారు.  కార్యక్రమం లో ఎంపీడీవో రాజేందర్‌, విద్యుత్‌ ఈఈ నల్లూరి మస్తాన్‌రావు, సర్పంచ్‌ యర్రా కృష్ణవేణిచౌదరి, ఎంపీటీసీ సుజాత, మాజీ ఎంపీపీ జ్యోతి హనుమంతరావు, అవిశన ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.


మంచినీటి సమస్యను పరిష్కరించరూ!

మార్టూరు, ఆగస్టు 18: తమ కాలనీకి మంచినీరు సక్రమంగా రావ డంలేదని, ఇంటి ముందు సైడు కాల్వల్లో మురుగునీరు సక్రమం గా వెళ్లడంలేదని యానాది కాలనీ వాసులు  వైసీపీ  నియోజకవర్గ ఇన్‌చా ర్జి రావి రామనాథంబాబును కోరారు. గురువారం సాయంత్రం మండ లంలోని వలపర్లలో జరిగిన గడప గడ పకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యానాది కాలనీలో ఆయన  పర్యటిం చగా కాలనీవాసులు పలు సమస్యల ను ఆయనకు విన్నవించారు. అనంత రం ఆర్య వైశ్యులకు చెందిన  పలు నివాస గృహాలకు వెళ్లి వారికి ప్రభుత్వ పథకాలను వివరించారు. రేషన్‌ కార్డు ల్లో తమ పేర్లు తొలగించారని, పలు ప్రభుత్వ పథకాలు తమకు అందడం లేదని ఆయనకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో తవ్వా ఆదినారాయ ణ, ము వ్వల రాముడు, కొల్లిపర పూర్ణచంద్రరావు, జాఫర్‌ ఆలీ, కాళహస్త్రి కృష్ణ, పసుమర్తి శాస్త్రి, కోటి నాగులు, దామర్ల శ్రీను, కోటి, పఠాన్‌ కాలేషావలి, వెంకటనారాయణ, గడ్డం మస్తానవలి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T05:49:16+05:30 IST