ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2022-01-28T05:15:23+05:30 IST

నిరుద్యోగుల సంక్షేమాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులే తగిన గుణపాఠం చెబు తారని యువజన కాంగ్రెస్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి జె.చంద్రశేఖర్‌యాదవ్‌ అన్నారు.

ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలం
రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న యువజన కాంగ్రెస్‌ నేతలు

- యువజన కాంగ్రెస్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి జె.చంద్రశేఖర్‌యాదవ్‌

- రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం 


 మహబూబ్‌నగర్‌, జనవరి 27 : నిరుద్యోగుల సంక్షేమాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులే తగిన గుణపాఠం చెబు తారని యువజన కాంగ్రెస్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి జె.చంద్రశేఖర్‌యాదవ్‌ అన్నారు. ఉద్యోగాల కల్పన లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గురువారం యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. దిష్టిబొమ్మను దహనం చేసేం దుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, యువజన కాంగ్రెస్‌ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసు కుంది. చివరకు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌యాదవ్‌ మాట్లా డుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నియామకాల ఊసే లే కుండా పోయిందని దుయ్యబట్టారు. నిరుద్యోగులు ప్రభుత్వంపై తిరగబడతారని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలు చేపట్టేవరకు యువజన కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు మహ్మద్‌ఖాదర్‌, శివశంకర్‌గౌడ్‌, మల్లు అనిల్‌కుమార్‌ రెడ్డి, బుచ్చయ్యయాదవ్‌. రవీందర్‌, శ్రీశైలం, శంశొ ద్దీన్‌, కేశవులు, నరేష్‌గౌడ్‌, హరికృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T05:15:23+05:30 IST