మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

ABN , First Publish Date - 2020-10-17T06:28:44+05:30 IST

మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌, జడ్పీటీసీ జర్పుల దశరథ్‌నాయక్‌ అన్నారు.

మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

కడ్తాల్‌ : మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌, జడ్పీటీసీ జర్పుల దశరథ్‌నాయక్‌ అన్నారు. మండలంలోని బాలాజీనగర్‌ తండాలో సర్పంచ్‌ రామావత్‌ కమ్లీబీచ్యానాయక్‌ అధ్యక్షతన బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పండుగలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కార్యక్రమంలో రైతుబంధు మండల  అధ్యక్షుడు జోగు వీరయ్య, ఎంపీటీసీలు లచ్చిరామ్‌ నాయక్‌, బండి మంజులచంద్రమౌళి, చల్లంపల్లి సర్పంచ్‌ కృష్ణయ్యయాదవ్‌, రమేశ్‌, సేవ్య, పాండు, రుక్మిణి, బీచ్యానాయక్‌, రాఘవేందర్‌, బీక్యానాయక్‌ జగన్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-10-17T06:28:44+05:30 IST