Abn logo
Aug 1 2021 @ 00:29AM

కులవృత్తుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

కోండ్రికర్లలో ఈత వనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు 

మెట్‌పల్లి రూరల్‌, జూలై, 31 : కుల వృత్తుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పే ర్కొన్నారు. శనివారం మండలంలోని బండలింగాపూర్‌, కోండ్రికర్ల గ్రామా ల్లో ఈత వనాలను ప్రారంభించి ఎంపీపీ మారు సాయిరెడ్డితో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌడ కు ల వృత్తుల ఆర్థిక సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ఈత వనాలను ఏర్పాటు చేసి ఉచితంగా మొక్కలను అందజేయడమే కాకుండా నీటిని అందించ డానికి బోరు బావులను ఏర్పాటు చేస్తామన్నారు. గీతకార్మికులకు పిం ఛన్‌, బీమా సౌకర్యాలను అందించి కుల వృత్తులను ప్రత్యేక చర్యలు చే పడుతున్నారన్నారు. కోండ్రికర్ల సర్పంచ్‌ ఆకుల రాజగంగు ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానించారు. కోండ్రికర్ల, కోనరావుపేట గ్రామాల మధ్య ఉ న్న వాగుపై బ్రిడ్జి పూర్తి చేసి గ్రామస్తులను ఆదుకోవాలని కోరగా స్పం దించిన ఎమ్మెల్యే త్వరలో నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ అంజయ్య, మెట్‌పల్లి విశాల సహాకార సం ఘం అధ్యక్షుడు లింగారెడ్డి, వైస్‌ ఎంపీపీ రాజేందర్‌గౌడ్‌, ఉప సర్పంచు లు భూమేశ్వర్‌, రాజం, ఎంపీడీవో భీమేశ్‌రెడ్డి, ఎంపీవో మహేశ్వర్‌రెడ్డి, ఎపీవో తిరుపతిరావు, ఎక్సైజ్‌ సీఐ రాధ, ఎస్సై సధాకర్‌, కార్యదర్శులు, గౌ డ కులస్తులు పాల్గొన్నారు.