ప్రభుత్వం నిద్రపోతోంది

ABN , First Publish Date - 2021-07-26T04:36:04+05:30 IST

మహబూబ్‌నగర్‌, జూలై 25: అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటాను తేల్చడం లేదని తెలంగా ణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ అన్నారు. విజ్ఞాపన పత్రాలతోనో, మంగళ హారతులతోనో రాష్ట్ర ప్రభుత్వం వినే పరిస్థితిలో లేదని, కుంభకర్ణుడిలా నిద్ర పోతున్న ప్రభుత్వం ఇకనైనా మేల్కొనాలని సూచిం చారు.

ప్రభుత్వం నిద్రపోతోంది
సమావేశంలో మాట్లాడుతున్న కోదండరాం

దక్షిణ తెలంగాణ కూడా రాష్ట్రంలోనే ఉంది 8 త్వరలోనే ప్రాజెక్టుల సందర్శన యాత్ర

ఏడేళ్ళైనా కృష్ణా జలాల్లో వాటా తేల్చకపోవడం దురదృష్ఠకరం 8 రాష్ర్టానికి నష్టం కలిగించే గెజిట్‌ను సవరించాలి

ప్రభుత్వంపై మండిపడ్డ ప్రొఫెసర్‌ కోదండరాం


మహబూబ్‌నగర్‌, జూలై 25: అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటాను తేల్చడం లేదని తెలంగా ణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ అన్నారు. విజ్ఞాపన పత్రాలతోనో, మంగళ హారతులతోనో రాష్ట్ర ప్రభుత్వం వినే పరిస్థితిలో లేదని, కుంభకర్ణుడిలా నిద్ర పోతున్న ప్రభుత్వం ఇకనైనా మేల్కొనాలని సూచిం చారు. దక్షిణ తెలంగాణ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని, కృష్ణానది అవతల రాయలసీమలో లేదని అన్నా రు. దీనిపై వెంటనే ఉద్యమ కార్యచరణ రూపొందిం చాలన్నారు. కృష్ణానది నిర్వహణ బోర్డు ఏర్పాటు- పరిణామాలపై పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ రాఘవాచారి ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ జిల్లా కేం ద్రంలోని రెడ్‌క్రాస్‌ భవనంలో ఆదివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి కోదండరాం ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణకు తీవ్ర నష్టం కలిగించే ఈ గెజిట్‌ను సవరించాలని, సమీక్షిం చాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో 67 శాతం కృష్ణా పరివాహక ప్రాంతం ఉంటే ఈ ప్రాంతానికి 299 టీఎంసీలు, 33 శాతం పరివాహకం ఉన్న ఆంధ్రకు 512 టీఎంసీల కేటాయింపులు విచారకరమన్నారు. కేటాయిం చిన నీటిని కూడా వాడుకునే పరిస్థితి లేదని, ప్రాజెక్ట్‌ల సామార్థ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా కేంద్రం తెలంగాణకు రావలసిన నీటి వాటాను కే టాయించకుండా, మొత్తం ప్రాజెక్టులను కృష్ణా రివర్‌ బోర్డు పరిఽధిలోకి తేవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును జూరాల నుంచి చేపట్టి, పడమటి ప్రాంతానికి నీళ్లివ్వాల న్నారు. త్వరలోనే ప్రాజెక్టుల సందర్శన యాత్ర చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి జిల్లా, పట్టణాల్లో ఇలాంటి రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించి ప్రజలను కదిలించే కార్యచరణ రూపొందించాలని సూచించారు. తెలంగాణ రాకముందు నీళ్ల కోసం ఉద్యమాలు చేశామని, తెలం గాణ వచ్చిన తరువాత కూడా నీళ్ల కోసం ఉద్యమాలు చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం మూడు లక్ష్యాలతో ముందుకెళ్తుందని, ఒకటి ఫాంహౌస్‌కు నీళ్ళు మళ్ళడం, రెండోది మెగా కృష్ణారెడ్డి ఇల్లు బంగారమై ప్రపంచంలోనే కుబేరుల స్థానంలో నిలవడం, తానున్నా లేకున్నా పాలమూరు ప్రాజెక్టు ఎవరు కట్టిండ్రు అంటే తన పేరు చెప్పుకోవడం అని, ఇవి తప్ప శాస్ర్తీయమైన తెలంగాణ లేదన్నారు.

పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ రాఘవాచారి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం 203 జీవో ద్వారా రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ చేపడుతోందని, ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదం కావడంతో కేంద్రం హడావుడిగా కృష్ణా రివర్‌ బోర్డ్‌ను ఏర్పాటు చేసి, తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధి లోకి తేవడం తెలంగాణకు తీరని నష్టం చేకూరుస్తుందన్నారు. అనుమతిలేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లో అనుమతి తీసుకోవాలని, లేదంటే అవన్నీ సీజ్‌ అవుతాయని చెప్పడం సరికా దన్నారు. తమ రాష్ట్రాల నుంచి పారే నదుల విషయంలో తమకే అధికారం లేదని గెజిట్‌లో పేర్కొనడం హాస్యా స్పదంగా ఉందన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. 

జలసాధన సమితి జిల్లా అధ్యక్షుడు అనంతరెడ్డి మాట్లాడుతూ దక్షిణ తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తాలన్నారు. మూడేళ్లలో పూర్తి చేస్తామన్న పాలమూరు పథకం ఆరేళ్లైనా 25 శాతం పూర్తి కాలేదన్నారు.

నల్గొండ జలసాధన సమితి అధ్యక్షుడు శ్రీధర్‌ మాట్లాడుతూ తెలంగాణకు కేటాయించిన నీటిలోనే 160 టీఎంసీలకు మించి వాడుకునే పరిస్థితి లేదన్నారు. నీటి వాటాను దక్కించుకోవడం ప్రభుత్వానికి ఇష్టం లేదని, దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని అన్నారు. కృష్ణా జలాలకన్నా ప్రభుత్వానికి హుజూరాబాద్‌ ఎన్నికలే ముఖ్యమయ్యాయని విమర్శించారు. 

విద్యార్థి నాయకుడు సతీష్‌ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణపై ఉన్న ప్రేమ పాలమూరు-రంగారెడ్డిపై లేదని, దీన్ని కేవలం రాజకీయ పబ్బంకోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. కృష్ణా రివర్‌ బోర్డ్‌కు రెండు రాష్ట్రాలు ప్రజల సొమ్ము రూ.400 కోట్లు ఇవ్వాలట కానీ, రాష్ట్రాల నుంచి మాత్రం ప్రాతినిధ్యం లేదని చెప్పడం విచారకరమన్నారు. బోర్డును వెంటనే ఉపసంహరించాలన్నారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక జిల్లా ఇన్‌చార్జి తిమ్మప్ప, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌, సీపీఎం రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్‌, టీఎఫ్‌టీయూ రాష్ట్ర నేత ఎస్‌ఎం ఖలీల్‌, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి హనీఫ్‌ అహ్మద్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, నాయ కులు వామన్‌కుమార్‌, శ్రీశైలం, బి.చంద్రశేఖర్‌, బిచ్చారెడ్డి, జి.రాజేందర్‌రెడ్డి, రాంమోహన్‌, శ్రీదేవి, ప్రభాకర్‌, బషీర్‌, మధుసూదన్‌, ఖాదర్‌పాష, ఇక్బాల్‌పాష పాల్గొన్నారు.

Updated Date - 2021-07-26T04:36:04+05:30 IST