విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి

ABN , First Publish Date - 2020-06-30T11:36:42+05:30 IST

విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం జూన్‌ 29: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ లైన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.40 లక్షలతో నిర్మించిన అదనపు గదులను ఆయన ప్రారంభించారు. తిర్మల్‌దేవుని గుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.32 లక్షలతో నిర్మించే అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాసన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులతో పాటు మధ్యాహ్న భోజనం, గురుకులాల్లో కార్పొరేట్‌ స్థాయి బోధన, బలవర్ధకమైన భోజనం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నర్సిములు, వైస్‌ చైర్మన్‌ తాటి గణేశ్‌, కౌన్సిలర్స్‌, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-30T11:36:42+05:30 IST