అమరావతి: రాష్ట్రానికి రాజధాని విషయంలో ప్రభుత్వానికి కొన్ని విధానాలు ఉంటాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తమకు ఉన్న అధికారాలతోనే రాజధానిపై చట్టాలు చేశామని ఆయన పేర్కొన్నారు. రాజధాని రైతులతో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు కడుపుమంటతో మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. రాజధానిపై చంద్రబాబు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీశారు. ప్రభుత్వానికి కొన్ని విధానాలు ఉంటాయని, ఆ ప్రకారమే జరగాలని తాము చర్చించుకున్నామన్నారు. తమకు ఇచ్చిన అధికారాలతోనే చట్టాలు చేశామని ఆయన పేర్కొన్నారు. మొదట టీడీపీ నేతలను రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆయన కోరారు. ప్రజాభిప్రాయం కోరితే అప్పుడు ఎవరు ఏమిటో తెలుస్తుందని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి