రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2022-01-18T06:04:57+05:30 IST

జిల్లాలో అతివృష్టి, అ నావృష్టి వల్ల అన్నిరకాల పంటలు దెబ్బతిని తీవ్ర సంక్షో భంలో ఉన్న రైతులు, గ్రామాల్లో పనుల్లేక వలసలు పోతు న్న కూలీలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఏ పీ రైతుసంఘం, వ్యవసాయ కార్మికసంఘం, కౌలు రైతుసంఘాల నాయకులు విమర్శించారు

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
మాట్లాడుతున్న రాంభూపాల్‌

రైతు, కూలీల సమస్యల పరిష్కారానికి

21న స్కూటర్లతో విజయవాడకు యాత్ర

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు రాంభూపాల్‌


అనంతపురం టౌన, జనవరి 17: జిల్లాలో అతివృష్టి, అ నావృష్టి వల్ల అన్నిరకాల పంటలు దెబ్బతిని తీవ్ర సంక్షో భంలో ఉన్న రైతులు, గ్రామాల్లో పనుల్లేక వలసలు పోతు న్న కూలీలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఏ పీ రైతుసంఘం, వ్యవసాయ కార్మికసంఘం, కౌలు రైతుసంఘాల నాయకులు విమర్శించారు. నెలరోజులపాటు పాదయాత్ర నిర్వహించినా కదలికలేని ప్రభుత్వాన్ని కదిలించడం కోసం ఈనెల 21న విజయవాడ వరకు స్కూటర్‌ యాత్ర ప్రారంభిస్తున్నట్టు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు రాంభూపాల్‌ పేర్కొన్నారు. సోమవారం స్థానిక గణేనాయక్‌భవనలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేరుశనగ పంట నష్టం అంచనాలు సక్రమంగా లేవని గతనెల 18వ తేదీన జరిగిన జిల్లా పరిషత సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ జేడీకి తెలపగా.. వారంరోజుల్లో సరైన అంచనాలు వేస్తామ ని చెప్పి నెలరోజులు గడిచినా ఇంతవరకూ నివేదిక ఎందు కు తయారు చేయలేదని ప్రశ్నించారు. వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామని, లక్ష్యంలో 70శాతం పూర్తిచేశామని అధికారులు ప్రకటించడం పుండుపై కారం చల్లినట్లు ఉందన్నారు. కణేకల్లు, శింగనమల ప్రాంతాల్లోనే 18వేల ఎకరాలు వరిసాగు జరిగితే ధాన్యం సేకరణ లక్ష్యం మాత్రం కేవలం 5వేల క్వింటాళ్లు పెట్టుకుని వ్యాపారులు, దళారులనుంచి కొనుగో లుచేసి రైతులను మోసం చేశారన్నారు. వ్యవసాయ పనులు లేకపోవడంతో కూలీలకు గ్రామాల్లో పనులు దొరక్క పట్టణాలకు, ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారన్నారు. ఉపాధి పనులు 200 రోజులు కల్పించి, రోజుకు కనీస వేతనం రూ.600లు చెల్లించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకోసం ఈనెల 12 నుం చి రైతు, కూలీలతో రెండు లక్షల సంతకాలు సేకరిస్తూ వచ్చామని, వీటిని ప్రభుత్వా నికి అందజేసేందుకు ఈనెల 21న అనంతపురం నుంచి వందలాది స్కూటర్లతో బయల్దేరి, 24న విజయవాడలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ రెడ్డి, ఏపీ కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి పాల్గొన్నారు.


Updated Date - 2022-01-18T06:04:57+05:30 IST