విద్యారంగ సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2022-08-13T05:29:35+05:30 IST

విద్యారంగ సమస్యలను పరిష్కరించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని ఏఐఎ్‌సఎఫ్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు మహంకాళి సుబ్బారావు విమర్శించారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలం
ర్యాలీలో పాల్గొన్నఏఐఎస్‌ఎఫ్‌ నేతలు, విద్యార్థులు

ఏఐఎ్‌సఎఫ్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు మహంకాళి 

కనిగిరి, ఆగస్టు 12 : విద్యారంగ సమస్యలను పరిష్కరించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని ఏఐఎ్‌సఎఫ్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు మహంకాళి సుబ్బారావు విమర్శించారు. ఏఐఎ్‌సఎఫ్‌ 87వ ఆవిర్భావ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత విద్యార్థులతో భారీ ర్యాలీ, జెండా ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌లో జరిగింది. అనంతరం గార్లపేట బస్టాండు సెంటరు వద్ద ఉన్న పాత పార్కు ప్రాంగణంలో జరిగిన సదస్సులో  సుబ్బారావు ప్రసంగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాహక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా పక్కదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. విలీన సమస్యతో గ్రామాల్లో పాఠశాలలు మూతపడి విద్యార్థులు చదువుకు దూ రమవుతున్నారని చెప్పారు.  ఈ నేపథ్యంలో ఏఐఎ్‌సఎఫ్‌ విద్యారంగ సమస్యలపై పోరాడు.. పోరాడి సాధించు.. అనే నినాదంతో ముందుకెళ్తోందన్నారు.  ఈ సంధర్భంగా నిర్వహించిన వివిధ ఆటల పోటీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లోని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎ్‌సఎఫ్‌ మాజీ రాష్ట్ర నాయకులు ఎం వెంకయ్య, ఎస్టీయూ మాజీ నాయకులు బృంగి సుబ్రమణ్యం, యాసిన్‌, ఎఐఎ్‌సఎఫ్‌ జిల్లా నాయకులు పవన్‌కళ్యాణ్‌, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు గుజ్జుల బాలిరెడ్డి, గులాంహసన్‌, మోహన్‌, సుబ్బారావు, అంజి, నవీన్‌, చైతన్య, అఖిల్‌, నారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T05:29:35+05:30 IST