ఇళ్లకు నిధుల విడుదలలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2022-01-21T06:13:53+05:30 IST

గత ప్రభుత్వ హయాంలో మంజూరైన గృహాలకు నిధులు విడుదలలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు.

ఇళ్లకు నిధుల విడుదలలో ప్రభుత్వం విఫలం
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి, తదితరులు

మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు


చీడికాడ/దేవరాపల్లి, జనవరి 20: గత ప్రభుత్వ హయాంలో మంజూరైన గృహాలకు నిధులు విడుదలలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు. గురువారం చీడికాడ, దేవరాపల్లి మండలంలోని వాలాబులో విలేకరులతో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో చీడికాడ మండలానికి 863, దేవరాపల్లికి 613, కె.కోటపాడు 657, మాడుగుల మండలానికి 1500 గృహాలను మంజూరు చేశామన్నారు. అవి 40 శాతం నిర్మాణాలు కాగా, ఇంతలో ఎన్నికలు వచ్చి నిలిచిపోయాయన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లయినా వారికి పేమెంట్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రజలు జగన్‌ను నమ్మి ఓట్లు వేస్తే రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్‌గా మార్చారన్నారు. ప్రగల్బాలు పలకడం తప్ప చేసిన ప్రగతి ఏమీ లేదని దుయ్యబట్టారు. అటవీ హక్కు పొందడానికి 400 మంది ఉంటే 193 మందికి పట్టాలు ఇచ్చారని, వారిలోనూ వలంటీర్‌ల కుటుంబాల వారే ఉన్నారని ఆరోపించారు. అనంతరం తురువోలు మోదమాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు పోతల చిన్నంనాయుడు, చెరకాన సూర్యనారాయణ, ఉండూరు దేముడు, పోతల రమణమ్మ, గండి లక్ష్మి, పి.దాలెంనాయుడు, జి.ముసలినాయుడు, రొంగలి రామునాయుడు, బీళ్ల కోటేశ్వరరావు, బొడ్డు శ్రీరామ్మూర్తి, పోడెల వెంకటలక్ష్మి, పి.జగన్నాథం, పోడెల కృష్ణ, బుజ్జి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T06:13:53+05:30 IST