మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2020-06-30T10:31:58+05:30 IST

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌

మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

మెడికల్‌ కళాశాల స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఆళ్ల నాని


పులివెందుల టౌన్‌, జూన్‌ 29: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) తెలిపారు. సోమవారం ముద్దనూరు రోడ్డులోని జేఎన్టీయూ కళాశాల సమీపంలో వైద్య కళాశాల, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించిన స్థలాన్ని కడప ఎంపీ వైఎస్‌ అవినా్‌షరెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్‌బాష, కలెక్టర్‌ హరికిరణ్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మ్యాప్‌లను పరిశీలించి చర్చించారు.


మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పులివెందులలో నిర్మించే మెడికల్‌ కళాశాలకు స్థలాన్ని పరిశీలించామన్నారు. అలాగే ప్రతి గ్రామానికి 104, 108 వాహనాలను ఏర్పాటుచేసి అందరికి మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 25 పార్లమెంట్‌ సెగ్మెంట్లలో 11 స్థానాలలో మెడికల్‌ కళాశాలలు ఉన్నాయని, కొత్తగా 15 కళాశాలలు, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులకు సీఎం అనుమతి ఇచ్చారని తెలిపారు.


ఏడాదిలో 15 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రూ.345 కోట్లతో నిర్మాణాలు చేపట్టేందుకు ఆగస్టులో టెండర్లు పిలుస్తామన్నారు. కరోనాకు సంబంధించి పరీక్షలు చేసేందుకు అనుగుణంగా ల్యాబ్‌లు, మిషన్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీవో నాగన్న, ఇతర అధికారులు పాల్గొన్నారు. 


వైద్య రంగానికి రూ.850 కోట్లు కేటాయింపు

రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి తెలిపారు. ఎంపీ అవినా్‌షరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.850 కోట్లు నిధులు కేటాయించారన్నారు. జిల్లాలో వైద్యసేవలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే విధంగా ముఖ్యమంత్రి జగన్‌ చొరవ చూపుతున్నారని తెలిపారు. 

Updated Date - 2020-06-30T10:31:58+05:30 IST