Abn logo
Jul 1 2020 @ 04:52AM

రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

శామీర్‌పేట రూరల్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌: రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఎంసీ.పల్లి మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్‌గా లక్ష్మాపూర్‌ మాజీ సర్పంచ్‌ కటికెల శ్యామల నియమితులయ్యారు. ఈ మేరకు మంత్రి ఆమెకు మంగళవారం నగరంలోని తన నివాసంలో నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, మురళిగౌడ్‌, విష్ణుగౌడ్‌, రవి, చిత్తయ్య, జంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అద్రాస్‌పల్లికి చెందిన సాయిబాబుకు సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరైన చెక్కును మంత్రి మల్లారెడ్డి మంగళవారం ఆయన నివాసంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ లలిత, ఉపసర్పంచ్‌ జహంగీర్‌, నాయకులు మురళీగౌడ్‌, నర్సింలు, రాజు, జంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం

ఘట్‌కేసర్‌ రూరల్‌: సీఎం రిలీఫ్‌ఫండ్‌ పేదలకు వరం లాంటిదని  మంత్రి మల్లారెడ్డి అన్నారు. కొర్రెములలో ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందిన సురేందర్‌కు మంజూరైన రూ.55వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును నగరంలోని తన స్వగృహంలో మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకటేష్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ రాజు, వార్డు సభ్యులు దుర్గారాజుగౌడ్‌, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement