వంద పడకల ఆసుపత్రి ఏర్పాటులో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-07-25T05:37:10+05:30 IST

పట్టణంలో వంద పడకల ఆసు ప త్రి ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ సీ నియర్‌ నాయకుడు.

వంద పడకల ఆసుపత్రి ఏర్పాటులో ప్రభుత్వం విఫలం
మొక్క నాటి నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

కోరుట్ల రూరల్‌, జూలై 24: పట్టణంలో వంద పడకల ఆసు ప త్రి ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ సీ నియర్‌ నాయకుడు. ధర్మపురి ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు కృష్ణారావు అన్నారు. శనివారం రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్బంగా ఆసుపత్రి ఆవరణలో కాంగ్రెస్‌ నాయకులు మొక్క లు నాటి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లా డారు. పట్టణంలో వంద పడుకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని  గతంలో ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్‌ హామీ ఇచ్చి మరిచారని చెప్పారు. హామీ నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ మొక్కను నాటి నిరసన తెలిపినట్లు తెలిపారు. 

అదే విధంగా కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాతో పాటు నిజామాబాద్‌ జిల్లాలోని కిసాన్‌నగర్‌ ప్రాంతంలో ఉన్న ఖాదీ బోర్డు భూములను అక్రమ అమ్మకాలపై ఎమ్మెల్యేను యువత నిలదీయాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నా యకులు ఎలేటీ మహి పాల్‌రెడ్డి, కొంతం రాజం, సోగ్రబీ, నయీం, మేకల నర్సయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T05:37:10+05:30 IST