కొవిడ్‌ నియంత్రణలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-05-09T05:35:07+05:30 IST

రాష్ట్రంలో కరోనా కరాళ నృత్యం చేస్తున్నా దానిని అరికట్టడంలో జగన సర్కారు పూర్తిగా విఫలమైందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి దుయ్యబట్టారు. అందరికీ టీకాలు ఇవ్వాలంటూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం శ్రీనివాసరెడ్డి హైదరాబాదులోని తన నివాసంలో నిరసన వ్యక్తం చేశారు.

కొవిడ్‌ నియంత్రణలో ప్రభుత్వం విఫలం
నిరసన తెలుపుతున్న పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి

సెకండ్‌వేవ్‌పై ముందు చూపేది?

వ్యాక్సిన వేయకుండా మోదీ భజన చేస్తారా?

నిరసనలో టీడీపీ నేతలు 

కడప, మే 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కరాళ నృత్యం చేస్తున్నా దానిని అరికట్టడంలో జగన సర్కారు పూర్తిగా విఫలమైందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి దుయ్యబట్టారు. అందరికీ టీకాలు ఇవ్వాలంటూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం శ్రీనివాసరెడ్డి హైదరాబాదులోని తన నివాసంలో నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డికి ప్రతిపక్షాన్ని అణచివేయడం, వేధించడంపై ఉన్న శ్రద్ధ కరోనా కట్టడిపై లేదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు. కమలాపురంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. కడప జిల్లా పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ ఇనఛార్జ్‌ అమీర్‌బాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శులు గోవర్ధనరెడ్డి బసవతారకం లా కాలేజీలో, స్వగృహంలో హరిప్రసాద్‌, జిల్లాలోని పలుచోట్ల టీడీపీ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కర్నూలులో కొత్త కరోనా 440కె ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించిన విషయాన్ని చంద్రబాబు చెప్పారన్నారు. ఏపీ నుంచి 440కె వైరస్‌ వ్యాప్తి చెందుతుందని, దీనిపై ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుందని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగిన విషయం గుర్తు చేసిందన్నారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోకుండా చంద్రబాబుపై కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. ఆక్సిజన, వెంటిలేటర్ల కొరత, వ్యాక్సిన లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వాటిని పట్టించుకోకుండా కేసులు పెడతారా అని ప్రశ్నించారు. కేసుల నుంచి బయట పడేందుకు సీఎం జగన ప్రధాని మోదీ జపం చేస్తున్నారంటూ విమర్శించారు. కరోనా నియంత్రణ చేతగాకపోతే మీ ప్రభుత్వం తప్పుకుంటే, ప్రజలను ఎలా రక్షించుకోవాలో చంద్రబాబుకు తెలుసన్నారు. రాష్ట్రానికి అవసరమైన టీకాను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. టీకా సరఫరా జిల్లాలో అస్తవ్యస్తంగా ఉందన్నారు. కార్యక్రమంలో పీరయ్య, నగర అధ్యక్షుడు జిలానీబాష, ఆమూరి బాలదాసు, శివకొండారెడ్డి, సుబ్బరాయుడు, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-05-09T05:35:07+05:30 IST